twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjun: ఆ దేశంలో పుష్ప సినిమా గ్రాండ్ రిలీజ్ ప్లాన్.. RRR తరహాలోనే ప్రమోషన్స్!

    |

    పుష్ప సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సెకండ్ పార్ట్ తో కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పుడు పుష్ప 1 సినిమాను వివిధ దేశాల్లో కూడా మళ్లీ విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

    పుష్ప ది రైజ్ సినిమాను సెప్టెంబర్ నెలలో జరిగిన మాస్కో ఫెస్టివల్ ప్రదర్శించగా అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఈ సినిమాను ఇంగ్లీష్ రష్యన్ సబ్ టైటిల్స్ ద్వారా వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కూడా కురిపించారు. అయితే అంత భారీ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప సినిమాకు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు రష్యాలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

    Allu arjun pan india movie pushpa the rise grand release plan in russia

    ఇటీవల దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు కూడా RRR సినిమాను జపాన్లో విడుదల చేసిన సందర్భంగా ప్రమోషన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దర్శకుడు సుకుమార్ తో పాటు హీరో అల్లు అర్జున్ కూడా రష్యాకు వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారట. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న మరి కొంతమంది నటీనటులు కూడా రష్యాకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

    ఇప్పటికే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అందుకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. పుష్ప సెకండ్ పార్ట్ ను కూడా వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ తరుణంలో పుష్ప మొదటి భాగాన్ని వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తున్నారు. వాటి రెస్పాన్స్ ను బట్టి ఆయా దేశాల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు రష్యా లో డిసెంబర్లో పుష్ప పార్ట్ 1 విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

    English summary
    Allu arjun pan india movie pushpa the rise grand release plan in russia
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X