మంచి కసిమీద ఉన్నా: అల్లు అర్జున్!
సినిమా ఫీల్డ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ డైనమిక్ హీరోలందరికన్నా గణనీయమైన సక్సెస్ రికార్డున్న హీరో అల్లు అర్జున్. అయితే ఆర్య2, వరుడు రెండు చిత్రాలు తన స్థాయికి తగ్గ విజయాలను దక్కకపోవడంతో కొంచెం ట్రాక్ తప్పిపోయాడు అల్లు అర్జున్. భారీ ఓపెనింగ్స్ వచ్చినా, విడుదల రోజే ప్రేక్ష అభిమానులను థియేటర్లకు రప్పించినా, ఆర్య2, వరుడు అందరినీ మెప్పించలేక పోయాయని అందరూ అంగీకరించాల్సిన నిజం. ఇవన్నీ ప్రక్కకు నెట్టి తన తాజా చిత్రం 'వేదం"తో బాక్స్ ఆపీస్ రికార్డులను తిరగరాయాలని పట్టుదలతో ఉన్నాడు అల్లు అర్జున్.
ప్రస్తుతం 'వేదం" చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ బాయ్ గా చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా పైన ఎన్నో ఆశలను పెట్టుకున్నాడు బన్నీ. 'గమ్యం" సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు క్రిష్ 'వేదం" సినిమాకి దర్శకుడు కావడంతో సినీ వర్గాల్లో కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి కలుగుతోంది. జూన్ నెలలో విడుదల కానున్న 'వేదం" తో మళ్లీ సక్సెస్ బాట పట్టాలని కసి మీదున్న అల్లు అర్జున్ ఆశలు నెరవేరాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











