'డెస్టినేషన్ మ్యారేజ్' కే నా ఓటు అంటున్న అల్లు అర్జున్
త్వరలో నిజ జీవితంలో వరుడుగా మారనున్న అల్లు అర్జున్ .. 'డెస్టినేషన్ మ్యారేజ్' నే ప్రిఫర్ చేస్తాను అని చెప్పినట్లు అల్లు అరవింద్ మీడియాకు తెలియచేసారు. ఇంతకీ డెస్టినేషన్ మ్యారేజ్ అంటే ఏమిటంటే... ఏదైనా దీవిలోగానీ, పెద్ద మహల్లోగానీ, నౌకలోగానీ వివాహం చేసుకోవడం. ముఖ్యులైనవారినే ఈ వేడుకకు ఆహ్వానిస్తుంటారు. అర్జున్ ఈ తరహాలోనే పెళ్లి చేసుకోవాలనుకొంటున్నారు.ఇక 2011 పిబ్రవరిలో ఈ వివాహం జరగనుంది. వధువు పేరు స్నేహా రెడ్డి.
ఈ విషయాలను మీడియాకు తెలియచేస్తూ అల్లు అరవింద్.. మా బన్నీ అభిరుచులకు తగిన అమ్మాయి స్నేహ. రెండు కుటుంబాల పెద్దలం మాట్లాడుకొన్నాం. ప్రస్తుతం బన్నీ 'బద్రీనాథ్' షూటింగ్ లో ఉన్నాడు. ఆ చిత్రం జనవరి చివరికి పూర్తవుతుంది. పెళ్లికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. ఫిబ్రవరిలో ఉండొచ్చు అన్నారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.


Click it and Unblock the Notifications











