Allu Arjun: కేఎఫ్‌సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. తెర వెనుక జరిగింది ఇదే..
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చిన బన్నీ తనదైన స్టైల్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాడు. ఇక సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయ్యాడు. తగ్గేదే లే అంటూ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ప్రముఖ బ్రాండ్స్ అల్లు అర్జున్‌తో జతకట్టి తమ వాల్యూను పెంచుకుంటున్నాయి. ఇటీవలే బన్నీ వరల్డ్‌వైడ్‌గా పాపులర్ అయిన కేఎఫీసీకి అడ్వర్టైజింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో దృశ్యాలను విడుదల చేశారు.
ఆద్యంత తనదైన స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్‌తో అలరిస్తూ వస్తున్న అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. ఈ మూవీలో బన్నీ నటనకు, స్వాగ్‌కు యావత్ ప్రేక్షక లోకం ఫిదా అయింది.

వెంటపడుతున్న టాప్ కంపెనీలు..
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ చూసిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ బ్రాండ్ కంపెనీలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు పుష్పరాజ్ వెంట టాప్ బ్రాండ్స్ వెంటపడుతున్నాయి.

కేఎఫ్‌సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా..
ఇప్పటికే రాపిడో, జొమాటో, అభి బస్ వంటి తదిర బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రముఖ ఫుడ్ కంపెనీ కేఎఫ్‌సీ సైతం బన్నీని బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ చేసుకుందంటే ఐకాన్ స్టార్ రేంజ్ ఏమాత్రం పెరిగిందో మనం ఊహించవచ్చు.

హ్యాండ్సమ్ లుక్‌లో..
ఈ యాడ్‌లో మనకు కన్నీళ్లు అంటే పడవు. ఘాటు ఎక్కువైనా సరే.. ఎమోషన్లో వచ్చినా, ఘాటు ఎక్కువై వచ్చినా.. తక్కువ లేదు.. ఎక్కువ కాదు కారం.. అంటూ పుష్ప రాజ్ స్టైల్లో చెప్పై బన్నీ డైలాగ్, హ్యాండ్సమ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

తెరవెనుక సన్నివేశాలు..
ప్రస్తుతం ఈ అడ్వట్వైజింగ్కు సంబంధించిన చిత్రీకరణ ఫొటోలను విడుదల చేశారు. కేఎఫ్ఎసీ అడ్వటైజ్కు సంబంధించిన ఈ బిహైండ్ సీన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కేఎఫ్‌సీ అడ్వటైజింగ్ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సుమారు 5 లక్షల మంది..
ఇది కాకుండా ఇటీవల న్యూయార్క్‌లో నిర్వహించిన అతిపెద్ద ఇండియన్ పరెడ్‌లో గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సుమారు 5 లక్షల మంది ప్రవాస భారతీయులు హాజరుకావడంతో న్యూయార్క్ వీధులు కోలాహలంగా మారాయి.

పుష్ప 2 అప్పుడే..
ఈ సందర్భంగా న్యూయార్క్‌లో పుష్ప మూవీలోని తగ్గెదే లే డైలాగ్ చెప్పి అందరిలో జోష్ పెంచాడు. ఇక పుష్ప ది రూల్ చిత్రం పూజా కార్యక్రమం ఆగస్టు 22న బన్నీ లేకుడానే జరిగింది. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ తర్వాత ప్రారంభం కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











