పూరీ, బన్నీ కాంబినేషన్ మూహూర్తం ఆ రోజే
అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేష్ లో దేశముదరు తర్వాత చాలా కాలం గ్యాప్ తో మరో చిత్రం ఖరారైంది. అక్టోబర్ 18న హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం చేయనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని పూరీ రూపొందించనున్నారు. స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైన ఈ చిత్రం బన్ని కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగిలిపోయే రేంజిలో ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. గణేష్ బాబు తన పరమశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రంలో శృతిహాసన్ ని హీరోయిన్ అడుగుతున్నారు.
ఇక ప్రస్తతం పూరీ జగన్నాధ్ ..పవన్ కళ్యాణ్ తో రూపొందిస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో బిజీగా ఉన్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రంలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. మీడియాపై వ్యంగ్య బాణంగా సాగే ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో పంచ్ డైలాగులు హైలెట్ అవుతాయంటున్నారు. పూరీ చాలా కాలం తర్వాత పవన్ తో చేస్తున్న చిత్రం ఇది.
అలాగే అల్లు అర్జున్ సైతం త్రివిక్రమ్ తో జులాయి చిత్రం పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నారు. అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవతం చేస్తున్నట్లు గా చెప్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.


Click it and Unblock the Notifications











