twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌ని అధికమించిన అల్లు అర్జున్.. నాని, పవన్ కళ్యాణ్‌కు చేరువగా!

    |

    సోషల్ మీడియాకు ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ తారలు తమని తాము ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా సినీతారలు సోషల్ మీడియా ఉపయోగించడం చాలా అవసరం. తమ సినీ విశేషాలని నేరుగా అభిమానులతో పంచుకునే అవకాశం సోషల్ మీడియా ద్వారా ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామజిక మాధ్యమాలు ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్లలో బాగా యాక్టీవ్ గా ఉంటాడు. ఇటీవల బన్నీ ట్విట్టర్ లో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు.

     ఎన్టీఆర్‌ని అధికమించి

    ఎన్టీఆర్‌ని అధికమించి

    అల్లు అర్జున్ ఇటీవల ట్విట్టర్ లో 3 మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అధికమించిన అల్లు అర్జున్ ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ సెలెబ్రిటీల హీరోల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. ఇటీవల బన్నీ తన పుట్టిన రోజు వేడుక జరుపుకున్నాడు. తన బర్త్ డేకి ఒకరోజు తర్వాత అల్లు అర్జున్ ట్విట్టర్ లో 3 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకోవడం విశేషం.

     పవన్, నానికి చేరువగా

    పవన్, నానికి చేరువగా

    అల్లు అర్జున్ ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో 6 వస్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 7.5 మిళియన్లతో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రెండవస్థానంలో నాగార్జున 5.7 మిలియన్ల, 3వ స్థానంలో రానా 5.5 మిలియన్ల, నాల్గవ స్థానంలో పవన్ కళ్యాణ్ 3. 5 మిలియన్ల, 5వ స్థానంలో నాని 3.2 మిలియన్లతో ఉన్నారు. అల్లు అర్జున్ 3 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతుండగా, ఎన్టీఆర్ 2.98 మిలియన్లతో ఉన్నాడు. దీనితో అల్లు అర్జున్.. నాని, పవన్ కళ్యాణ్ కు చేరువయ్యాడు.

    పేస్ బుక్‌లో టాప్

    పేస్ బుక్‌లో టాప్

    అల్లు అర్జున్ పేస్ బుక్ లో 12 మిలియన్ల ఫాలోవర్స్ తో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. బన్నీ ఇంస్టాగ్రామ్లో కూడా బాగా యాక్టీవ్ గా ఉన్నాడు. అల్లు అర్జున్ తన డాన్సులు, నటనతో యువతకు బాగా చేరువయ్యాడు. టాలీవుడ్ లో టాప్ డాన్సర్లలో బన్నీ ఒకడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.

     యువ దర్శకుడితో

    యువ దర్శకుడితో

    త్రివిక్రమ్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కి ఒకే చెప్పిన బన్నీ మరో యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎంసీఏ లాంటి హిట్ చిత్రాన్ని తెరకేకించిన వేణు శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి 'ఐకాన్.. కనబడుటలేదు' అనే టైటిల్ కూడా ఖరారైంది.

    English summary
    Allu Arjun pushes down Jr NTR in list of most popular Telugu actors on Twitter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X