Pushpa 2 Censor: పుష్ప 2 సెన్సార్ పూర్తి.. డిలీట్ చేసిన సీన్స్ ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప2: ది రూల్'. ఈ మూవీ డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విడుదల దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై హైప్స్ పెంచేలా కొత్త కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా అభిమానులు ఆందోళనకు తెర పడింది. సినిమా షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం..ఎడిటింగ్ పై డే అండ్ నైట్ వర్క్ చేసిన సుకుమార్ 'పుష్ప 2' సినిమా ఫైనల్ కాపీ రెడీ చేశారు. నేడు పుష్ప 2 సెన్సార్ కూడా పూర్తి అయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ , సాంగ్స్ ఎనలేని అద్భుతమైన స్పందన వస్తుంది. మెయిన్ గా పుష్ప 2 స్పెషల్ సాంగ్ అదిరిపోయే మాస్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ మూవీ లోని కొన్ని సీన్స్ కట్ చేస్తూ..కొన్ని డైలాగ్స్ కు బీప్స్‌తో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే.. ఇందులో మూడు పదాలను మార్చినట్టు తెలుస్తోంది. అలాగే.. రెండు ఫైట్స్ సీన్ ల్లో కొంత భాగం కట్ చేసినట్టు తెలుస్తోంది . సెన్సార్ బోర్డ్ సూచనలను పరిశీలిస్తే.. పుష్ప 1
సీక్వెల్ కు వస్తున్న పుష్ప 2 లో డైరెక్టర్ సుకుమార్ యాక్షన్ డోస్ ను పెంచినట్లు తెలుస్తోంది.
కొన్ని సీన్స్ బీభత్సంగా ఉండడంతో వాటిపై సెన్సార్ బోర్డు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ప్రకారం పుష్పరాజ్ నరికిన కాలు గాల్లో ఎగురుతోందట. దాన్ని తొలగించాలని సర్టిఫికెట్ బోర్డు సూచించింది. అలాగే మరో ఫైట్ సీన్లో విలన్ చేతిని నరికి దాన్ని పుష్పరాజ్ పట్టుకొని వెళ్తాడట. ఆ సీన్లు కూడా తొలగించాలని సెన్సార్ చెప్పింది. ఇలా రెండుచోట్ల సీన్స్ కట్ చేయాలని సూచించింది సెన్సార్ బోర్డ్.

అలాగే 'రండా' అనే పదాన్ని, ' వెంకటేశ్వర' అనే మాటకు 'భగవంతుడా 'అని మార్చుకోవాలని సూచించింది. అలాగే 'లపాకీ'
అనే పదాన్ని కూడా తొలగించాలని, మరొక పదాలను మార్చగా.. అసభ్యకరంగా ఉన్న పదాలను మ్యూట్ లేదా బీఫ్ సౌండ్ వెయ్యాలని సూచించింది. ఇలా పలు చోట్ల కత్తెరేసింది సెన్సార్ బోర్డ్.
ఇక పుష్ప 2 సినిమా రన్‌టైమ్ పై గత వారం రోజులు గా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో పలు పుకార్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఎవరూ ఎన్ని పుకార్లు చేసినా.. కచ్చితంగా మూడున్నర గంటలు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, 'తగ్గేదేలే' అన్నట్లు 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో పుష్ప 2 సినిమా ను రూపొందించారు. మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ప్రస్తుతం పుష్ప 2 సెన్సార్ సర్టిఫికెట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











