ఆ విషయంలో అల్లు అర్జున్ పై ఫేక్ ప్రచారం.. ఘాటుగా స్పందించిన మూవీ మేకర్స్..
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాంటిస్పేటరీ మూవీ పుష్ప 2. ఈ సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతుంది. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ కొనసాగుతుంది. పుష్ప సినిమాలో వివాదాస్పద డైలాగులున్నాయంటూ సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ వివాదంపై పుష్ప మూవీ మేకర్స్ సీరియస్ గా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే ?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అంతకుమించి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇంకా మాస్ గా చెప్పాలంటే.. అల్లు అర్జున్, రష్మిక గ్లామర్ స్టెప్పులకు.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక శ్రీలీల ఐటమ్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

అల్లు అర్జున్ యాక్షన్ కు.. సుకుమార్ టేకింగ్ కు అల్లు ఆర్మీ థియేటర్లను తగలబెట్టేస్తున్నాయి. ఊహించని విధంగా పుష్ప 2 భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లకు కొల్లగొడుతుంది. పుష్పరాజు సునామీ ముందు ఇతర పాన్ ఇండియా సినిమాల రికార్డులు గల్లంతయాయనే చెప్పాలి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ, పుష్ప సినిమాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అల్లు అర్జున్ ఆంటీ ఫ్యాన్స్ నుండి కూడా అదే విధమైన రెస్పాన్స్ వస్తుంది.
అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ.. ట్రోల్, కామెంట్ చేస్తూ పుష్ప సినిమాలో డైలాగ్స్ ను మార్చేస్తున్నారు. వివాదాస్పద డైలాగులుగా మార్చేస్తూ సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేస్తున్నారు. దీంతో పుష్ప మూవీ మేకర్స్ మైత్రి సంస్థ సీరియస్ అయింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ట్రూలర్స్, ఆంటీ ఫ్యాన్స్ ను గట్టిగా హెచ్చరించింది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
'ఊహాజనితమైన సొంత క్రియేటివిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప 2 సినిమాలోవి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కావాలని కొంతమంది పుష్ప 2 సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారు. సినిమాలో లేని డైలాగులకు మసాలా జోడిస్తూ తమ సొంత డైలాగ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏది ఒరిజినల్ డైలాగు.. ఏది క్రియేటివ్ డైలాగ్స్ తెలియకుండా కొన్ని మీడియా ఛానల్స్ వీటిపై డిబేట్ కూడా పెట్టేస్తున్నాయి. ఇలా ఫేక్ డైలాగ్స్ ప్రచారం చేయడం పైరసీని ఎంకరేజ్ సరికాదు' అంటూ మైత్రి మూవీ మేకర్స్ ఫైర్ అయింది.
ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024
కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ టీవీ డిబేట్లో పాల్గొనడం, సినిమా లో లేని డైలాగ్ గురించి మాట్లాడడం చూస్తూనే ఉన్నా వాటిపై తమకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ పి ఆర్ టీం కూడా క్లారిటీ ఇచ్చింది. అసలు సినిమాలో లేని డైలాగులు ప్రచారం చేయడంతో అల్లు వర్సెస్ మెగా వరకు ఆర్జం పోసినట్లే అవుతుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వీటిపై ఎలా దృష్టి సారిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











