Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. అల్లు అర్జున్‌కు ఊరట
Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్, పుష్ప 2 సినిమా నిర్మాతలు పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి.. మధ్యంతర బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేసులో పుష్ప ఓ ట్వీస్ట్ చోటు చేసుకుంది. సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించింది. అసలేం జరిగిందంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పుష్ప 2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్,యెర్నేని నవీన్ లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే.. వారిని అరెస్టు చేయరాదని పోలీసులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ.. పుష్ప 2 సినిమా నిర్మాతలు రవిశంకర్, నవీన్ లు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. వీరికి అనుకూలంగా మద్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

తొలుత పిటిషన్ తరపు న్యాయవాది తమ వాదనలను వినిపిస్తూ.. ఆ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటన సందర్భంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలు తమ అభ్యర్థులకు వర్తించవని అన్నారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నట్లు, తమ సిబ్బంది థియేటర్ నిర్వాహకులకు పోలీసులకు సమాచారం ఇచ్చారని, ఆ ఘటన జరిగిన రోజు సీనియర్ అధికారులు థియేటర్ వద్ద భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో ఏకీభవించిన జడ్జీ.. పిటిషనర్లను అరెస్టు చేయరాదని, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. అయితే.. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని, పోలీసులకు ఫిర్యాదు వరకు నోటీసులను జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదిలా ఉంటే ఈ కేసులో అరెస్ట్ అయిన సంధ్య థియేటర్ మేనేజర్ అడ్ల శరత్ చంద్ర నాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేష్, శ్రీరాములు రాజు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 6 కు వాయిదా వాయిదా వేసింది కోర్టు.

మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమిచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ బాలుడు కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చినా.. గత రెండు రోజులుగా శ్రీతేజ్ ఆరోగ్యం విషమిచ్చిందనీ, ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నట్టు తెలుస్తోంది. ఇదెలా ఉంటే.. కేసులో అల్లు అర్జున్ ను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొబోతున్నారు? మరోసారి అరెస్టు చేస్తారా ? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.


Click it and Unblock the Notifications











