Allu Arjun Pushpa 2: పుష్ప రాజ్ దెబ్బతో.. బహుబలి, RRR,KGF రికార్డ్స్ బ్రేక్..

Pushpa 2 advance booking: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2'. ఈ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచం వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఫ్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఇతర ఫ్యాన్ ఇండియా సినిమాల రికార్డులను బద్దలు కొట్టేసింది. వివరాల్లోకెళ్తే..

అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా పుష్ప 2. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా పుష్ప 1 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా సినీ ప్రేక్షకులు ఉత్కంఠ గా వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందుగా వచ్చిన పలు అప్డేట్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ట్రైలర్, ఐటమ్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. పుష్ప 2 ట్రైలర్ కేవలం 16 గంటల్లో 40 మిలియన్లు వ్యూస్ సంపాదించుకొని నయా రికార్డును క్రియేట్ చేసింది.

Allu Arjun Pushpa 2 sold 1 million tickets amassed Rs 50 crore in pre-sales In advance booking

ఇక పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్ లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇండియాలోనే 6,500, ఓవర్సీస్ లో 500 స్క్రీన్స్ లలో విడుదలకు సిద్ధమైంది. ఇది ఇండియా చరిత్రలోనే అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా విదేశాలలో కూడా తన మార్క్ ను క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో అత్యధిక వేగంగా 50 వేల టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది అల్లు అర్జున్ పుష్ప 2.

ఇక ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అత్యధిక వేగంగా బుక్ మై షో లో 1 మిలియన్ టికెట్లను అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా అడ్వాన్స్ బుకింగ్‌లలో రూ.50 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.దీని బట్టి.. 'కల్కి 2898 AD', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్', 'K.G.F.: చాప్టర్ 2' వంటి సినిమాల రికార్డులు బ్రేక్ అయినట్టు తెలుస్తోంది. విడుదలకు ముందే ఇలా ఉంటే.. విడుదల తరువాత పుష్ప గాడి హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రేడ్ వర్గాల ప్రకారం పుష్ప 2 మూవీ తొలి రోజు రూ. 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X