Pushpa: పుష్ప మరో నేషనల్ రికార్డు.. ఇండియాలోనే ఏకైక మూవీ.. 8 రోజుల్లోనే అన్ని లక్షల మంది చూశారా!

గత ఏడాది వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను చేశాడు. పాన్ ఇండియా రేంజ్‌లో పక్కా మాస్ మసాలా చిత్రంగా ఇది రూపొందింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ.. మొదటి పార్ట్ 'పుష్ప ద రైజ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీనికి అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో కలెక్షన్లను భారీ స్థాయిలో అందుకుంటూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మూవీ బుక్‌మైషోలో ఏకంగా నేషనల్ రికార్డునే అందుకుంది. ఆ వివరాలు మీకోసం!

 ‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చిన బన్నీ

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన సినిమానే 'పుష్ప'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ రోల్స్‌ను చేశారు.

బన్నీ కెరీర్‌లోనే భారీ రిలీజ్ ఇదే

బన్నీ కెరీర్‌లోనే భారీ రిలీజ్ ఇదే

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో రిలీజ్ అయింది.

అన్ని చోట్లా హవా చూపించాడుగా

అన్ని చోట్లా హవా చూపించాడుగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఎన్నో అంచనాలతో ఐదు భాషల్లో విడుదలైంది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో'గా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే టాక్‌తో విజయం దిశగా హవాను చూపిస్తూనే ఉంది.

కలెక్షన్ల వర్షం... 200 కోట్లతో రచ్చ

కలెక్షన్ల వర్షం... 200 కోట్లతో రచ్చ

చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చిన 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాలు, భాషల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో వీకెండ్ పూర్తయ్యే సరికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఆల్‌టైం రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇక, ఎనిమిది రోజుల్లోనే ఈ మూవీ రెండు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను కూడా అందుకుంది.

పుష్ప పేరిట మరో నేషనల్ రికార్డ్

పుష్ప పేరిట మరో నేషనల్ రికార్డ్

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప' మూవీ అనుకున్నట్లుగానే అదరగొడుతోంది. ఈ మూవీ రెండో వారంలోకి వెళ్లినా రెస్పాన్స్‌ను మాత్రం అదే రీతిలో అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ మూవీ పేరిట మరో నేషనల్ రికార్డ్ వచ్చి చేరింది.

 8 రోజుల్లోనే అన్ని లక్షల మంది

8 రోజుల్లోనే అన్ని లక్షల మంది

'పుష్ప' సినిమా విడుదలై నిన్నటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి బుక్‌మైషోలో 3.50 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే అక్షరాలా 35 లక్షల మంది బుక్‌మైషో ద్వారా ఈ సినిమాను వీక్షించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఏ సినిమాకూ ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడవలేదు. దీంతో బన్నీ మూవీ పేరిట నేషనల్ రికార్డు నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X