Pushpa యూనిట్‌కు కోలుకోలేని షాక్.. రిలీజైన గంటల్లోనే ఫుల్ మూవీ లీక్.. ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకే వాళ్ల వాళ్ల కలయికల్లో సినిమాలు రావాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాలతో మెప్పించారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఈ జోడీ కలిసి చేసిన చిత్రమే 'పుష్ప'.
ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప మూవీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయింది. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చిన బన్నీ
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలను చేశారు.

బన్నీ కెరీర్‌లోనే తొలిసారి భారీగా
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో రిలీజ్ అయింది.

మొత్తం అదే మాట వినిపిస్తోంది
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. దీంతో అతడి అభిమానులు సంబరాలు చేస్తున్నారు.

భారీ ఓపెనింగ్స్.. రికార్డులు బ్రేక్
రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది 'పుష్ప' మూవీ. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కడంతో అన్ని చోట్లా భారీ స్థాయిలో విడుదలైంది. దీంతో ఈ సినిమాను మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్నో రికార్డులు కూడా నమోదవబోతున్నాయి. ఇక, ఓవర్సీస్‌లో ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది.

పుష్ప టీమ్‌కు కోలుకోలేని దెబ్బ
ఎన్నో అంచనాలతో, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'పుష్ప'. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్లు తెలుగు వాళ్లతో కళకళలాడుతున్నాయి. దీంతో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ మూవీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఆన్‌లైన్‌లో పుష్ప మూవీ లింక్స్
చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప' మూవీని కూడా లీక్ చేసేశాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయి. దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉందనే చెప్పాలి.
Recommended Video

రిపోర్టు చేస్తున్నా.. తగ్గడం లేదు
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పైరసీ భూతం మరింత ఎక్కువ అయింది. దీంతో చాలా మంది ఈ సైట్లపై రిపోర్టులు చేస్తున్నారు. దీంతో కొన్ని యూఆర్‌ఎల్‌ను క్రియేట్ చేసి మరీ సైట్లను నడుపుతున్నారు. అలాగే, వీటి కోసమే కొన్ని ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద సినిమాలకు ఇవి గుదిబండలా మారుతూ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











