For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa Movie: మరో రికార్డు క్రియేట్ చేసిన 'పుష్ప'.. ఇక ప్రపంచం మొత్తం 'తగ్గేదే లే' అననుందా?

  |

  పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఇటు అల్లు అర్జున్ కు, అటు రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. అంతేకాకుండా ఈ మూవీ అనేక రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ఈ క్రేజీ మూవీ పుష్ప. మరి ఆ విశేషాలేంటో ఓ చూపు చూద్దామా!

  స్మగ్లింగ్ నేపథ్యంలో..

  స్మగ్లింగ్ నేపథ్యంలో..

  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది.

  ముఖ్యంగా హిందీలో..

  ముఖ్యంగా హిందీలో..

  మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం. ఇక ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్ కు యావత్ దేశం ఫిదా అయింది. తెలుగు ప్రేక్షకులకు మించిన రెస్పాన్స్ నార్త్ ఆడియెన్స్ నుంచి రావడం విశేషం.

   యాక్టింగ్, డ్యాన్స్ లకు ఫిదా..

  యాక్టింగ్, డ్యాన్స్ లకు ఫిదా..

  బన్నీ యాక్టింగ్, మ్యానరిజం, యాసతోపాటు రష్మిక మందన్నాతో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అంతేకాకుండు స్పెషల్ అట్రాక్షన్ గా స్టార హీరోయిన్ సమంత సాంగ్ హైలెట్ గా నిలిచింది. దీంతో ఎక్కడా చూసిన పుష్ప మేనియానే కనపడింది. ఈ సినిమాలోని డైలాగ్ లు, హుట్ స్టెప్పులు, పాటను స్ఫూప్ చేస్తూ, అనుకరిస్తూ ఎన్నో రీల్స్, వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోయాయి.

  అధిక అవార్డు సొంతం..

  అధిక అవార్డు సొంతం..

  అంతేకాకుండా సుకుమార్ టేకింగ్ తో తెరకెక్కిన విధానానికి అనేక రికార్డులు సొంతం చేసుకుంది పుష్ప. భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికే సైమా (SIIMA) అవార్డ్స్ లోనూ ఎక్కవ అవార్డ్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పుష్ప చిత్రం మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది.

  అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో..

  అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో..

  మాస్కొలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పుష్ప సినిమాను ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ విభాగం కింద ఈ ఏడాదికి పుష్ప సినిమా ఎంపికైంది. ఈ సినిమాను తెలుగుతోపాటు ఇంగ్లీషు, రష్యన్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పుష్ప మూవీని రష్యన్ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

  వరల్డ్ వైడ్ గా పెరగనున్న క్రేజ్..

  వరల్డ్ వైడ్ గా పెరగనున్న క్రేజ్..

  దీంతో పుష్ప చిత్రానికి ఉన్న క్రేజ్ దేశం ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో పుష్ప ప్రదర్శన తర్వాత రష్యన్ ప్రజలతో పాటు యావత్ ప్రపంచం కూడా తగ్గేదే లే అని డైలాగ్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఈ షోతో అల్లు అర్జున్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరగనున్నట్లు తెలుస్తోంది.

  రెండో పార్ట్ లో మరికొంత మంది..

  రెండో పార్ట్ లో మరికొంత మంది..

  కాగా అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక, 'పుష్ప ద రూల్'లో మరికొందరు ప్రముఖులు నటించబోతున్నారట.

  English summary
  Allu Arjun And Rashmika Mandanna Starrer Pushpa The Rise Movie Screened In Moscow International Film Festival. Sukumar Directed Movie Pushpa Selected Under The Category Of Blockbuster Hit Around The World.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X