Pushpa Twitter Review: బన్నీ మూవీకి షాకింగ్ టాక్.. మొత్తం అదిరింది కానీ.. ఓవరాల్‌గా ఎలా ఉందంటే!
ఇటీవల వచ్చిన కొన్ని సినిమా వల్ల తెలుగు సినిమా స్టామినా విశ్వ వ్యాప్తంగ కావడంతో మన ఇండస్ట్రీలో కొంత కాలంగా భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో నాలుగైదు భాషల్లో రూపొందుతున్నాయి. అలాంటి సినిమాల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన 'పుష్ప' మూవీకి ట్విట్టర్‌లో వచ్చిన రివ్యూలపై ఓ లుక్కేద్దాం పదండి!

‘పుష్ప'గా ఎంటరైన అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

రెండు భాగాలుగా.. పుష్ప రాజ్ రెడీ
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. గురువారం రాత్రి నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శన అయ్యాయి. అలాగే, చాలా చోట్ల బెనిఫిట్ షోలు కూడా వేసేశారు.

భారీ స్థాయిలో బిజినెస్.. గ్రాండ్‌గా
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల లెక్క.

పుష్ప మూవీకి ఊహించని టాక్‌తో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మూవీ ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు కూడా పడిపోయాయి. అన్ని చోట్లా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. ఇందులో చాలా వరకూ బాగుందని, కొందరు ఏవరేజ్ అని ట్వీట్ చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా అని
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీని చూసిన వాళ్ల అభిప్రాయం ప్రకారం.. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్ల పరిచయం, కథను ప్రారంభించడంతో పాటు కొన్ని ఎలివేషన్స్ సీన్స్‌తో ఉంటుందట. ఇక, ద్వితీయార్థం మొత్తం హీరో, విలన్ గ్యాంగ్ మధ్య జరిగే పోరాటంతో సాగుతుందని అంటున్నారు. ఇక, రెండో పార్ట్ కోసం ఈ చిత్రాన్ని అర్థాంతరంగానే ముగించారట.

సినిమా ప్లస్‌లు, మైనస్‌లు ఇవేనట
'పుష్ప' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో అల్లు అర్జున్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమాటోగ్రఫీ, సమంత స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో ప్లస్‌లు అని అంటున్నారు. అదే సమయంలో సెకెండాఫ్, సినిమా నిడివి, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఈ మూవీకి మైనస్‌గా మారాయని సినిమాను చూసిన వాళ్లు ట్వీట్ల ద్వారా చెబుతున్నారు.

మొత్తంగా పుష్ప ఎలా ఉందంటే
ఎన్నో అంచనాలతో పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. ఈ సినిమాకు అనుకున్న రేంజ్‌లో టాక్ రాలేదనే చెప్పాలి. కొందరు ఈ సినిమా బాగుందని అంటుండగా.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు. మొత్తంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోగా దీన్ని చెబుతున్నారు. మాస్ సినిమాలు నచ్చే వాళ్లకు మాత్రం పండగే అంటున్నారు.
Recommended Video

అలా వెళ్తేనే సినిమా నచ్చుతుంది
క్రేజీ కాంబినేషన్ కావడంతో 'పుష్ప' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను భారీగా ఊహించుకుని వెళ్లకూడదని కొందరు వీక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. అంటే ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్తేనే ఇది నచ్చుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, రాను రానూ ఈ టాక్ మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











