తప్పుడు ప్రచారం అంటూ అల్లు అర్జున్ ఆవేదన
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు అల్లు అర్జున్ దొరకాడంటూ ఓ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో, వెబ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గమనించిన అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. వాస్తవం ఏమిటో వివరించే ప్రయత్నం చేసారు. తనను తప్పుగా చిత్రీకరించే విధంగా ప్రచారం చేయటాన్ని ఖండించారు.

నాకు తెలిసి హైదరబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎవరన్నా పట్టుబడితే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వదలరు. ఈ విషయం లేకుండా ఓ వీడియో నెట్ లో తిరుగుతోంది. ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ చెయ్యడం మానేయండి. ఒక వేల నును డ్రింక్ చేసినా ఎప్పుడూ వాక్ చేసుకుంటూ వెళతా లేకపోతే ఎవరినన్నా డ్రాప్ చేయమని అడిగి వెళ్తాను. ఇలాంటి వీడియో ని రిలీజ్ చేసి నెగటివ్ గా ప్రచారం చేయడం అనేది అస్సలు బాగోలేదని' అల్లు అర్జున్ అన్నాడు.


Click it and Unblock the Notifications











