కైరాదత్తా తో అల్లు అర్జున్ చిందులు
హైదరాబాద్ : అల్లు అర్జున్ ప్రస్తుతం కైరాదత్తాతో స్టెప్స్ వేస్తూ బిజీగా ఉన్నారు. అతనితో పాటు కమిడియన్స్ శ్రీనివాసరెడ్డి, తాగుబోతురమేష్ తదితరులు కూడా ఈ పాటలో చిందులేస్తున్నారు. ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదంతా అల్లు అర్జున్ తాజా చిత్రం 'రేసుగుర్రం' కోసమే. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్, సలోని హీరోయిన్స్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరావు నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. అల్లు అర్జున్, కైరాదత్తాపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''తనవారి కోసం దేనికైనా, ఎంతకైనా తెగించే లక్షణం ఉన్న కుర్రాడి కథ ఇది. పోటీకి దిగాడంటే విజయం వరించే దాకా విశ్రమించని తత్వం అతనిది. సినిమా ప్రారంభంలో వచ్చే గీతాన్ని చిత్రీకరిస్తున్నాం. దినేష్ మాస్టర్‌నృత్య రీతులు సమకూరు స్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన వస్తోంది' అన్నారు.
ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











