బన్నీ, రామ్ చరణ్ అందరం కలిసే...
నేను చెన్నైలో ఉండగా బన్నీ, రామ్ చరణ్ అందరూ కలిసి చదువుకున్నవాళ్లమే. అలాగే తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు మరో నట వారసుడు అభినయ్. దాసరి యంగ్ ఇండియా చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ కుర్రాడు తనకు మంచి పరిచయాలే ఉన్నాయని, అయినా మహానటి సావిత్రి మనవడుని అనే గుర్తిస్తారని అంటున్నారు. ఇక తమిళంలో సావిత్రి కంటే జెమిని గణేశన్ మనవడు అనేసరికి అందరికీ బాగా తెలుస్తుంది అని చెప్పుతున్నాడు.ఇక సావిత్రి కుటుంబం నుంచి వచ్చినవాణ్ని కాబట్టి నాపై మరింత బాధ్యత పెరుగుతుంది. అన్ని రకాల సినిమాల్లోనూ నటిస్తాను. ఇక 'అమ్మమ్మ సావిత్రి తన వారసులు కూడా వెండి తెర మీద కనిపించాలని ఆశపడేదని అమ్మ చెబుతుండేది. ఆమె కోరిక నా ద్వారా తీరినందుకు సంతోషంగా ఉందని" చెబుతున్నారు అభినయ్ వడ్డి. బెస్టాఫ్ లక్ అభినయ్.
అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ యంగ్ ఇండియా అభినయ్ సావిత్రి దాసరి నారాయణరావు జెమినీ గణేషన్ allu arjun ram charan teja young india savitri dasari abhinay


Click it and Unblock the Notifications