మెగా ఫాన్స్ చర్చంతా ఈ ఫోటోల గురించే.. మేనల్లుడిపై అత్త ప్రేమ, ఊపు ఊపేస్తున్నాయి!
నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ బన్నీ ద్వయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారి మెగా అభిమానులని అలరించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఆర్మీ మాన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వక్కంతం వంశి ఈ చిత్రానికి దర్శకుడు.
చాలా కలం తరువాత బన్నీ, రాంచరణ్ కలసి స్టేజి షేర్ చేసుకోవడంతో మెగా ఫాన్స్ పట్టరాని సంతోషంతో ఉన్నారు. రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం వెంటనే స్టైలిష్ స్టార్ నా పేరు సూర్య చిత్రంతో రంగంలోకి దిగుతుండడంతో మెగా సినిమాల సందడి కనిపిస్తోంది. కాగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో బన్నీ, చరణ్ ద్వయం ఆకట్టుకున్నా.. రాంచరణ్ కు సంబందించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పండగ చేసుకుంటున్న మెగా ఫాన్స్
బన్నీ, చరణ్ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులు గడుస్తోంది. మెగా కాంపౌండ్ ని ప్రస్తుతం లీడ్ చేస్తున్న స్టార్ హీరోలు వీరిద్దరే. బన్నీ సినిమా ఈవెంట్ కు రాంచరణ్ చీఫ్ గెస్ట్ గా రావడంతో వీరిద్దరిని ఒకే వేదికపై చూసుకునే అవకాశం అభిమానులకు దక్కింది. కాగా ఈ ఈవెంట్ కు సంబందించిన కొన్ని రాంచరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

కీ రోల్ ప్లే చేస్తున్న అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీనియర్ హీరో ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎవరు గ్రీన్ యంగ్ లుక్ లో అదరగొట్టారు. బన్నీ, రాంచరణ్, అర్జున్ పక్కపక్కనే కూర్చున్నారు. రాంచరణ్ బుగ్గలని అర్జున్ నిమురుతుంటే బని పగలబడి నవ్వుతున్న ఫోటో అభిమానులని ఆకట్టుకుంటోంది.

మేనల్లుడిపై అత్త ప్రేమ
నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ తల్లిందండ్రులు అల్లు అరవింద్, నిర్మల హాజరయ్యారు. అల్లు అర్జున్ తల్లి నిర్మల మేనల్లుడు చరణ్ పై ప్రేమ కురిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్ బుగ్గలు నిమురుతూ ముద్దు పెడుతున్న ఫొటో నెట్ లో చక్కర్లు కొడుతోంది.

అందరి కళ్ళు వారిపైనే
వేదికపై ప్రసంగించే సమయంలో బన్నీ, చరణ్ ద్వయం మెగా అభిమానులకు కనుల విందుగా మారింది. రాంచరణ్, బన్నీ తమ ప్రసంగాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

బన్నీ ఎంట్రీ అదుర్స్
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైలైట్ అయిన మరో అంశం అల్లు అర్జున్ ఎంట్రీ. అల్లు అర్జున్ ఎంట్రీని స్పెషల్ గా ప్లాన్ చేసామని మొదట్నుంచి చిత్ర యూనిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే క్రేన్ సాయంతో బన్నీ స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చాడు. బన్నీ వెనుక జాతీయ జెండా అభిమానులని ఆకట్టుకుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబందించిన ఈ ఫోటోలు మెగా అభిమానులని ఒక ఊపు ఊపుతున్నాయి.


Click it and Unblock the Notifications











