విడాకుల వార్తపై అల్లు అర్జున్ స్పందన
ఊహించని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ కావడంతో షాకైన అల్లు అర్జున్, ఈ వార్తలపై స్పందించారు. 'మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుంచే మా మధ్య ప్రేమ మొదలైంది. నేను, స్నేహ ఎలాంటి ఘర్షణలు లేకుండా మా వైవాహిక జీవితం పట్ల సంతోషంగా ఉన్నాము' అని స్పష్టం చేసారు.
'నేను సీనీ రంగంలో ఉన్నాను కాబట్టి నాకు రూమర్లు అలవాటయిపోయాయి. కానీ స్నేహ, ఆమె కుటుంబ సభ్యులు ఇలాంటి వార్తలు జీర్ణించుకోవడానికి సమయం పడుతుంది. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు కనాలనే ప్లాన్లో ఉన్నాం' చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ సినిమా విషయానికొస్తే....ఆయన నటించిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఇటీవల విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
