నేను స్పాట్ లో ఉంటే సీన్ మరోలా వుండేది: బన్ని
సినిమా హీరోలు చొక్కానలగకుండా పది మంది రౌడీలను చితగొట్టడం ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ సినిమాల్లో చూసి ఉంటాం. కానీ ఇప్పటి హీరోలు కాస్త ట్రెండ్ మార్చారు. ఇప్పుడు హీరోలు ఇలా రౌడీలను కొట్టటం ఆ సమయంలో ఒకటి రెండు చోట్ల గాయాలు, బట్టలు నలిగిపోయినట్లు చూపటం కాస్త చూపుతున్నారు. ఇప్పుడు ఈ సోదంగా ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ షూటింగ్ పై దాడి జరిగింది.
దానిపై బన్ని మాట్లాడుతూ అక్కడ షూటింగ్ జరుగుతుండగా మా మేనేజర్ కి ఫోన్ వచ్చింది. వెంటనే ఆయన నన్ను అక్కడి నుండి పంపివేసారు. నేను చాలా జోవియల్ కానీ కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. సమస్య ఇంకా జటిలం అవుతుంది. అందుకే నన్ను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని యూనిట్ వారు చెప్పారు. అయినా నేను అక్కడ ఉంటే దేశముదురు దెబ్బ రుచి చూపించే వాడిని అంటున్నాడు బన్ని. కానీ తాను కూడా మామయ్యలా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలనుకునే వాడిని కనుక ఇటు వంటి అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నాను అని దేశముదురు తెలిపారు.


Click it and Unblock the Notifications











