యాడ్ ఫిల్మ్: బన్నీతో ప్రభుదేవా వెరైటీ స్టెప్స్ (ఫోటోలు)
ముంబై : స్టైలిష్ అల్లు అర్జున్ కోల్గెట్ మాక్స్ ఫ్రెష్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైలో ఇందుకు సంబంధించి యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా ఈయాడ్ కోసం బన్నీతో అదిరిపోయే వైరైటీ స్టెప్స్ వేయించారు.
యాడ్ ఫిల్మ్ ప్రారంభం ఈ సందర్భంగా బన్నీ-ప్రభుదేవా కేక్ కట్ చేసారు. యూనిట్ సభ్యులతో జాలీగా గడిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ వీక్షించ వచ్చు. మార్కెట్లో ఇతర టూట్ పేస్ట్ కంపెనీల పోటీని తట్టుకునే విధంగా సరికొత్త రీతిలో తమ బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్న కోల్గేట్ కంపెనీ...దక్షిణాదిన మంచి పాపులారిటీ ఉన్న అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం అతను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేస్ గుర్రం' చిత్రం చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

యాడ్ ఫిల్మ్ ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన అల్లు అర్జున్, ప్రభుదేవా

అల్లు అర్జున్‌తో స్టెప్పులేయిస్తున్న ప్రభుదేవా. ఈ యాడ్లో అల్లు అర్జున్ డాన్స్ ఓ రేంజిలో ఉండనుంది.

కోల్గెట్ మాక్స్ ఫ్రెష్ జెల్ యాడ్ ఫిల్మ్ యూనిట్ సభ్యులతో సందడిగా గడిపిన అల్లు అర్జున్, ప్రభుదేవా

గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభోత్సవం జరుపుకున్న ‘రేస్ గుర్రం' చిత్రం షూటింగ్ జులై 3 నుండి యూరఫ్‌లోని జెనీవాలో ప్రారంభమైంది.

జెనీవాలో షూటింగ్ పూర్తయిన తర్వాత యూరఫ్‌లోని ఇతర లొకేషన్లలో షూటింగ్ జరుగనుంది.

నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అల్లు అర్జున్ సరసన శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్యామ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











