అల్లు అర్జున్ రికమండేషన్ తో ఆమెకు ఆఫర్

By Srikanya

ఓ ఆంగ్ల దినపత్రికలో నా ఫొటోను చూసిన అల్లు అర్జున్‌ నన్ను దర్శకుడు సుకుమార్‌కు రికమండ్‌ చేశారు. వెంటనే ఆ యూనిట్‌ నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అడిషన్‌ చేశారు. కాని నన్ను ఎంపిక చేశారా, లేదా? అనేది వెంటనే చెప్పలేదు అంటూ తనకి ఆర్య-2 చిత్రంలో ఆఫర్ ఎట్లా వచ్చిందో చెప్పుకొచ్చింది శ్రధ్ధా దాస్.

ఆ తర్వాత మూడు నెలలు దాటింది. ఇక నేను ఆ సినిమాపై ఆశలు వదులుకున్నాను. ఒకరోజు సడన్‌గా ఫోన్‌ చేసి 'మీరు సెలెక్ట్‌ అయ్యారు, ఫలానా తేదీ నుంచి షూటింగ్‌ ఉంటుంది' అని చెప్పగానే ఎంతో సంతోష మన్పించింది. అల్లు అర్జున్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న 'ఆర్య-2' చిత్రంలో నాది ఓ ముఖ్యమైన పాత్రే. నవదీప్‌కు జోడీగా వుండే పాత్ర. తప్పకుండా ఈ చిత్రం నన్ను ప్రేక్షకులకు మరింత చేరువచేస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పు కొచ్చారు శ్రద్ధాదాస్‌.

'సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ ముంబయ్‌ భామ ప్రస్తుతం తన ఆశలన్నీ 'ఆర్య-2' పైనే పెట్టుకున్నారు. తొలి చిత్రం తర్వాత టార్గెట్‌, డైరీ, అధినేత, 18, 20 లవ్‌స్టోరీ చిత్రాల్లో నాయికగా చేసినా... ఆమెకు సరైన కమర్షియల్‌ బ్రేక్‌ రాలేదు.దాంతో ఆమె ఈ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకుంది. 'ఆర్య-2'లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని, ఈ చిత్రం తనకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని శ్రద్ధాదాస్‌ అంటున్నారు. బెస్టాఫ్ లక్ శ్రధ్దా దాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X