పాత చింతకాయ పచ్చడికి ‘క్రిష్’ కొత్త కారం- అల్లు అర్జున్స్ ‘వేదం’!
1978లో అమితాబ్ బచ్చన్ మరియు వినోద్ ఖన్నా నటించిన ఫేమస్ హిందీ చిత్రం'ముఖ్దార్ క సికందర్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి 1980లో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయసుధ కలిసి నటించిన చిత్రం 'ప్రేమ తరంగాలు" ఈ చిత్రాన్ని ఇప్పుడు జాగర్లమూడి రాధాకష్ణ(క్రిష్) 'వేదం" అనే టైటిల్ లో తెరకెక్కించారు. ఈ చిత్రం మే 20న విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్రలో మనోజ్, కృష్ణంరాజుగా అల్లు అర్జున్ నటిస్తుండగా, జయసుధ పాత్రను అనుష్క చేస్తోంది.
ఓ పెద్ద హోటల్ లో పాప్ స్టార్ గా పేరు పొంది అక్కడ పాటలు పాడుతూ చిరంజీవి బాగా సంపాదిస్తుంటాడు..అనుకోకుండా కృష్ణం రాజు (సమాజం చేదుని మిగల్చడంతో జులాయిగా, రౌడీగా తిరుగుతూ అన్యాయం పై దండెత్తి డబ్బు సంపాదిస్తుంటాడు) స్నేహితుడుగా పరిచయం అవుతాడు. కృష్ణంరాజు చెల్లెలుగా చెప్పుకునే(సుజాత) అమ్మాయిని చిరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పటి వరకు కైకాల సత్యనారాయణకు కీప్ గా ఉండి రంగసాని పాత్రలో ఉన్నజయసుధను ప్రేమిస్తాడు..ఆమె దగ్గర తన కష్టాన్ని చెప్పుకొని సంతోషపడుతుంటాడు..కృష్ణంరాజు చివరికి ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు కానీ అది సాధ్యపడదు.
ఇదే స్టోరీని యథావిధిగా కాకుండా కొంచెం మార్చి క్రిష్ తన దర్శకత్వం ప్రతిభను జత చేసి ఇదొక 'వేదం" గా చిత్రీకరించాడు. ఈ చిత్రంలో స్లమ్ ఏరియాల్లో తిరుగుతూ రెండు చేతులూ సంపాదించే రౌడీగా అల్లు అర్జున్ అధ్బుతమైన నటనను ప్రదర్శిస్తే రాక్ స్టార్ గా మనోజ్ తన సామర్థాన్ని ప్రదర్శించాడు. మరి అనుష్క రంగసాని పాత్రలో లీనమైపోయింది అని చెప్పడానికి అవధులు లేవంట. అందుకే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు ప్రసాద్ దేవినేని, యార్లగడ్డ శోబు ఆశిస్తున్నారు. క్రిష్ కూడా ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని ఎంతో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడని సినీమా వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











