బిగ్ షాక్.. అల్లు అర్జున్ కు రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు..
Allu Arjun: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. అల్లు అర్జున్ రాకతో తన భార్య చనిపోయిందనీ, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీసులు నాంపెల్లి కోర్టు ముందు హాజరు పరచారు. ఈనేపథ్యం కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా అల్లు అర్జున్ అభ్యంతరను తిరస్కరించింది.దాంతో.. పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.



Click it and Unblock the Notifications











