అది మాత్రం మారలేదు.. దానికి సాక్ష్యాన్ని త్వరలోనే చూస్తారు.. బన్నీ ట్వీట్ వైరల్
స్టైలీష్ స్టార్‌గా అల్లు అర్జున్‌ను నిలబెట్టిన దర్శకుడు సుకుమార్. అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన సుకుమార్ తన ప్రతిభనంతా కూడబెట్టి అల్లు అర్జున్‌కు తిరుగులేని స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టాడు. ఆర్య సినిమాతో కేవలం యూత్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య2 చిత్రం కూడా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.

మోస్తరుగా ఆడిన ఆర్య2
అయితే ఆర్య 2 విడుదల సమయానికి రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ మూవీ ఆడియో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు అతి పెద్ద బలం. ఆ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయంటే.. అది దేవీ మ్యూజిక్‌లో ఉండే మ్యాజిక్. నేటితో ఈ చిత్రం విడుదలై పదేళ్లు గడిచిన నేపథ్యంలో బన్నీ చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఆర్య2 ఆడియో హిట్..
ఆర్య2 చిత్రంలోని ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడెంత గుండె ఏమిటో అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాటను గుర్తు చేస్తూ.. ఈ సంతోషాన్ని దాచుకునేందుకు నిజంగానే నా హృదయంలో చోటు సరిపోదు.. ఆర్య2లో ప్రయాణం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలను తెలిపాడు.
సుక్కుపై ప్రేమను కురిపించిన బన్నీ..
ఆర్య, ఆర్య2 చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌కు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా, ఎంత చెప్పినా సరిపోదు. ఐ లవ్యూ.. నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్యూ నా ప్రాణం పోయినా.. అంటూ ఆ పాటలోని మరో లైన్‌తో సుకుమార్‌పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచాడు.

అది మాత్రం మారలేదు..
సుక్కు గడ్డం నెరిసింది.. నా చర్మం రంగు మారింది.. కానీ మా మధ్య ఉన్న ప్రేమ మారలేదు.. ఇద్దరం కలిస్తే పుట్టే పిచ్చి ఎప్పటికీ మారదు.. దానికి సాక్ష్యాన్ని త్వరలోనే మీరు చూస్తారు.. అంటూ అల్లు అర్జున్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Recommended Video

హ్యాట్రిక్ దిశగా..
ఇన్నేళ్ల తరువాత మళ్లీ సుకుమార్‌తో కలిసి అల్లు అర్జున్ మరో చిత్రాన్ని చేయబోతోన్నాడు. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న సుక్కు ఓ వైపు.. నా పేరు సూర్యలాంటి డిజాస్టర్ తరువాత వరుస సినిమాలను పట్టాలెక్కిస్తోన్న బన్నీ మరోవైపు. వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూడో చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











