»   » అతిలోక సుందరి కోసం అల్లు అర్జున్ ఏం చేసాడో తెలుసా..బన్నీ సూపర్ అంతే!

అతిలోక సుందరి కోసం అల్లు అర్జున్ ఏం చేసాడో తెలుసా..బన్నీ సూపర్ అంతే!

Subscribe to Filmibeat Telugu
Sridevi Last Rites : Let Her Rest In Peace, Allu Arjun's Plea

శ్రీదేవి ఆకస్మిక మరణం లక్షలాది మంది అభిమానులకు శోకాన్ని మిగిల్చింది. దుబాయ్ లో పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడ బాత్ టబ్ లో మృతి చెందారు. బాత్ టబ్ లో మృతి చెందడం నమ్మశక్యంగా లేకపోవడంతో మీడియాలో పలురకాల ఉహాగానాలు మొదలయ్యాయి. శ్రీదేవి మరణం మిస్టరీగా మారింది.దీనికితోడు దుబాయ్ అధికారులు విచారణ పేరుతో శ్రీదేవి మృతదేహాన్ని ఇండియాకు తీసుకునివెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు.

శ్రీదేవి మృతి పట్ల అనుమానాలు బలపడుతున్న క్రమంలో ఎట్టకేలకు దుబాయ్ అధికారులు శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మీడియాలో చెలరేగుతున్న ఉహాగానాల పట్ల పలువురు సెలెబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ జాబితాలో బన్నీ కూడా చేరడం విశేషం.

ఉహాగానాలకు ఇకైనా తెర పడుతుందా

ఉహాగానాలకు ఇకైనా తెర పడుతుందా

శ్రీదేవి పార్థివ దేహాన్ని దుబాయ్ అధికారులు ఎట్టకేలకు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీనితో ముంబై లో శ్రీదేవి అంత్యక్రియలకు రంగం సిద్ధం అవుతోంది. శ్రీదేవి మృతిపట్ల మీడియాలో చెలరేగుతున్న ఊహాగానాలకు ఇకనైనా తెరపడుతుందేమో అని సెలెబ్రిటీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకిలా

చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకిలా

శ్రీదేవి మరణమే పెద్ద షాక్. అది ఎలాగు జరిగిపోయింది. ఇక అనవసరమైన ఉహాగానాలతో ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేయవద్దని, శ్రీదేవి లాంటి లెజెండ్రీ నటి ఆత్మకు శాంతి కలిగేలా సంయమనం పాటించాలని ప్రముఖ రచయిత కోనవెంకట్ ట్విట్టర్ ద్వారా మీడియాని, అభిమానులని రిక్వస్ట్ చేశారు.

అసత్యాలు వద్దు అంటున్న మెహ్రీన్

అసత్యాలు వద్దు అంటున్న మెహ్రీన్

శ్రీదేవి మరణం తరువాత తాను ఈ వార్తని నమ్మలేకున్నానని దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మెహ్రిన్, ఆమె మృతి పట్ల అసత్య ప్రచారాలు వద్దు అంటూ అభిమానులని ఉద్దేశించి ట్వీట్ చేసారు.

తాజాగా బన్నీ

తాజాగా బన్నీ

సోమవారం నుంచి నుంచి శ్రీదేవి మృతి విషయంలో అనుమానాలు ఎక్కువయ్యాయి. మీడియాలో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. వెలువడుతున్న వార్తలన్నీ శ్రీదేవి చివరి మజిలీకి విషాదాంతంగా మారబోతున్నట్లు కనిపించింది. దీనిపై అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించాడు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలిగేలా ప్రవర్తించాలని మీడియాని కోరాడు. ఉహాగానాలు స్వస్తి చెప్పాలని బన్నీ ట్వీట్ చేయడం విశేషం.

సెలెబ్రిటీలు కోరుతున్నది ఇదే

సెలెబ్రిటీలు కోరుతున్నది ఇదే

శ్రీదేవి మృతితో షాక్ కి గురైన సినీలోకం, తాజా వార్తలతో విస్మయాన్ని వ్యక్తం చేసింది. శ్రీదేవి మరణం విషయంలో ఏం జరుగుతోందంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారం ఆపాలని కోరారు. ఎట్టకేలకు శ్రీదేవి పార్థివ దేహం ముంబై తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Allu Arjun request to media and fans to stop speculations over Sridevi death. Let her Rest In Peace
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu