twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒన్ సైడ్ లవ్ ని మర్చిపోలేకపోతున్న బన్ని

    By Srikanya
    |

    హైదరాబాద్ : రీసెంట్ గా రేసు గుర్రం తో పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన కెరీర్ లో బెస్ట్ సినిమా మాత్రం వేరే ఉంది అంటున్నాడు. అది ఆర్య చిత్రం. ఆర్య చిత్రం పదేళ్ళు పూర్తయిన సందర్బంగా తన బెస్ట్ ఫిలిం మాత్రం ఆర్యనే అని తేల్చి చెప్పేసాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఒన్ సైడ్ లవ్ కాన్సెప్టుతో ఫీల్ మై లవ్ అంటూ అప్పుడు కుర్రకారుని ఊపేసింది. యూత్ లోకి తనను తీసుకుపోయి నిలిపిన చిత్రంగా బన్నీకి ఈ చిత్రం ఎప్పటికీ మరుపురానిదే. మరవలేనిదే.

    'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్‌ ...అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తూండటంతో అంతటా ఓ రేంజి లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఈ నెల్లో గ్రాండ్ గా సిని పెద్దల సమక్షంలో లాంచ్ చేయటానికి నిర్మాత రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కొత్త పార్టీ పెడుతూ జనం మధ్యకు వస్తూండటంతో త్రివిక్రమ్ ఆ వ్యవహారాల్లో పూర్తి బిజీ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో బన్నీ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

    Allu Arjun reveals his best film till date

    రేసు గుర్రం తర్వాత గోపీచంద్ మలినేనితో పండుగ చేస్కో చిత్రం చేయటానికి స్క్రిప్టు వర్క్ జరిగింది. అయితే త్రివిక్రమ్ తో ఓకే చేయటంతో అదిప్పుడు రామ్ దగ్గరకి వెళ్లింది. అటు హరీష్ శంకర్ చిత్రమూ రిజెక్టు చేసారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ చిత్రం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అయితే ఎలక్షన్స్ అయ్యేదాకా త్రివిక్రమ్ ఖాళీ పడలేదు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు.

    దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. మరో ప్రక్క అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' రీసెంట్ గా రిలీజయ్యి సూపర్ హిట్టైంది.

    English summary
    There’s another film which Allu Arjun considers to be the best film in career. And it happens to be ‘Arya’, which released 10 years ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X