కొడుకుతో అల్లు అర్జున్ చీకటి ఖండానికి!
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొడుకుకు తొలిసారి విదేశీ యాత్రకు తీసుకెలుతున్నాడు. అది కూడా చీకటి ఖండానికి. చీకటి ఖండం అంటే మరేదో అనుకోవద్దు సుమీ. కొడుకుతో కలిసి సౌతాఫ్రికా వెలుతున్నాడు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు.
న్యూ ఇయర్ వేడుకలను తన భార్య స్నేహా రెడ్డి, తనయుడు అయాన్ తో కలిసి సౌతాఫ్రికాలో ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. జనవరి రెండో వారంలో ఇండియా తిరిగి వస్తారని అంటున్నారు. అల్లు అర్జున్ దంపతులు తన కొడుకును అల్లారుముద్దుగా పెంచుతున్నారు. అఫ్ కోర్స్ ఏ తల్లిదండ్రులకు తమ బిడ్డలంటే ఎనలేని ప్రేమ ఉండటం సహజమే.

సాధారణంగా సెలబ్రిటీ కొడుకు అంటే అభిమానులు, మీడియా వారు ఆసక్తి చూపడం మామూలే...అయాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. అభిమానులు, మీడియా ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ తన కొడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు.
పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు.


Click it and Unblock the Notifications











