బద్రీనాథ్ రాకింగ్ స్టంట్స్ తో టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలనం...
'బద్రీనాథ్" చిత్రానికి వెచ్చించిన భారీ బడ్జెట్ పాటు అల్లు అర్జున్ చేసిన పోరాటాలు కొత్తగా వుంటాయని ముందు నుండే చెప్పుకుంటున్నాం. యాక్షన్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కేవలం ఈ సినిమా కోసమే అల్లు అర్జున్ తో వియత్నాం వెళ్లి వొవిన్ ఆమ్, వియట్ వో తువాట్ అనే రెండు మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం, అవే కళల్ని 'బద్రీనాథ్"లో ప్రదర్శించడం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ సంచలనమైంది...
అందుకే సైఫ్ అలీఖాన్ తన 'ఏజెంట్ వినోద్" మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పీటర్ ని పిలిపించుకొని మరోసారి వియత్నాం వెళ్లాలని సూచించాడట. అంతేకాక సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు సైతం ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆరాటపడుతున్నారు. అందుకే అటు పీటర్ హెయిన్స్ తో పాటు, ఇటు వియత్నాంలోని మాస్టర్లు కూడా తెగ సంతోషించి, భారీగానే ఫీజులు కూడా వసూలు చేస్తూ బాగుపడిపోతున్నారు.
allu arjun tamanna badrinath vv vinayak allu aravind అల్లు అర్జున్ తమన్నా బద్రీనాథ్ వివి వినాయక్ అల్లు అరవింద్


Click it and Unblock the Notifications