twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెర్రీ పెళ్లిలో...బన్నీ రొమాంటిక్ యాక్షన్!

    By Bojja Kumar
    |

    ఓ వైపు రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరుగుతుంటే...మరో వైపు అల్లు అర్జున్ పెళ్లిని వీక్షించడం సంగతి అటుంచి భార్య స్నేహారెడ్డితో పబ్లిగ్గా రొమాన్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయన వాలకం చూసిన వారంతా మనోడికి సినిమా షూటింగుల బిజీ వల్ల ఇంట్లో టిఫిను, మీల్సూ సరిగా దొరకడం లేదేమో అని గుసగుసలాడుకుంటున్నారు. కొందరేమో పెళ్లిలో ఇలాంటి చేష్టలేమిటి? పక్కవారు ఇబ్బంది పడతారనే కామన్ సెన్స్ కూడా లేదా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

    రామ్ చరణ్-ఉపాసన వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానుల కోసం ఈ రోజు టెంపుల్ ట్రీస్‌లో ప్రత్యేకంగా వెడ్డింగ్ రిసెప్షన్, విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని మెగా బ్రదర్ నాగబాబు కోరారు.

    ఇక బన్నీ గురించి మాట్లాడుకుంటే...ప్రస్తుతం జులాయి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం.... జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందనేది సినిమా కథాంశం.

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియాన నటిస్తుండగా...రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత: రాధాకృష్ణ, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పకులు: డి వివి దానయ్య.

    English summary
    Stylish star Allu Arjun love for his wife was witnessed by all who were in present at Ram charans Marriage. Allu Arjun is seen just behind his wife Sneha through out the wedding of Ram Charan and Upasna today. Allu Arjun and Sneha caught the attention of many this way and they have become the favorite for photographers. Well, none should blame Arjun for his advances on his wife in public.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X