అల్లు అర్జున్ హీరోయిన్‌గా విదేశీ భామ!
హైదరాబాద్: అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈచిత్రంలో ఒక హీరోయిన్ గా అమల పాల్ ఎంపికైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం మరో హీరోయిన్ పాత్రకు నికోల్ అనే ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు పూరి.
ఈ విషయాన్ని పూరి స్వయంగా ఖరారు చేసింది. ఆయన ఓ పత్రికతో మాట్లాడుతూ...అల్లు అర్జున్ సరసన రెండో హీరోయిన్ కోసం ఓ విదేశీ మోడల్ ను సంప్రదిస్తున్నామని, ఆమె ఓకే చెప్పగానే మళ్లీ ప్రకటిస్తానని చెప్పారు. అదే జరిగితే అల్లు అర్జున్ తన 12 ఏళ్ల యాక్టింగ్ కెరీర్లో తొలి సారిగా విదేశీ మోడల్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం కానున్నాడు.
గతంలో పూరి గాబ్రియేలా బెర్టాంటె, స్కార్లెట్ విల్సన్ లాంటి వీదేశీ మోడళ్లను తన సినిమాల్లో ఐటం భామలుగా చూపించాడు. ఇప్పుడు ఏకంగా విదేశీ మోడల్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశం అయింది. కాగా...'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి ముహూర్థం ఖరారైంది. అక్టోబర్ 17న ఈచిత్రం పూజా కార్యక్రమం నిర్వహించి అక్టోబర్ 25నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవలే 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ 'బన్నీ, పూరి జగన్ కాంబినేషన్‌లో మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ కోసం జగన్నాథ్ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











