అల్లు అర్జున్ మళ్ళీ దేశముదురు హీరోయిన్ తో రొమాన్స్...
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'దేశముదురు" సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన హన్సిక, ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయట్లేదు. ప్రస్తుతం రామ్ సరసన 'కందిరీగ' సినిమాలో కథానాయికగా నటిస్తున్న బబ్లీ హన్సిక త్వరలో అల్లు అర్జున్ సినిమాలో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. వివి వినాయ్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న 'బద్రీనాథ్' సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్ లో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమాలో కథానాయికగా హన్సిక సెలెక్ట్ అయిందని అంటున్నారు. అయితే సుకుమార్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో హన్సికకు బన్నీ హీరోయిన్ గా ఛాన్సిస్తాడా? స్సెషల్ సాంగ్ తో సరిపెడతాడో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











