బోయపాటి మూవీ: టీవీ నటితో అల్లు అర్జున్ రొమాన్స్?
హైదరాబాద్: బాక్సాఫీస్ కలెక్షన్లని రేసుగుర్రంలా పరిగెత్తించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుస సూపర్ సక్సస్‌లతో పవర్‌ఫుల్ దర్శకుడిగా తనకంటూ బాక్సాఫీస్‌లో ప్రత్యేక స్థానం సంపాయించిన పవర్ ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్ మీదకి వెల్లనుంది.
అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్‌తో సక్సస్‌ల మీద సక్సస్‌లు కొడుతున్న థమన్. ఎస్.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. తాజాగా అందుతున్న సమాచారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన టీవీ నటిని హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
హిందీలో పాపుల్ అయిన టీవీ నటి సోనారికా ఈ చిత్రంలో హరోయిన్ గా చేసే అవకాశం ఉంది. సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగ శౌర్య సరసన ‘జాదూగాడు' చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. అందం, పర్ ఫెక్ట్ ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉండటంతో బోయపాటి దృష్టిలో పడింది. అల్లు అర్జున్ కూడా ఆమెను ఓకే చేసినట్లు టాక్.

గతంలో ఓ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్ని కి బాగా నచ్చి మా బ్యానర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ లవ్ స్టోరి మిక్స్ అయిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బన్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బన్ని బాడీ లాంగ్వేజ్ కి సరిపోయో కరెక్ట్ కథ సిధ్ధంచేశాను. అరవింద్ గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే లవ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బన్ని కనపడతాడనేది ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.


Click it and Unblock the Notifications











