రామోజీ ఫిల్మ్‌సిటీలో గొడవపడుతున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. ఇక్కడ చీకట్లో జోరుగా వర్షం కురుస్తున్న నేపధ్యంలో ఓ ఫైట్ ని షూట్ చేస్తున్నారు. వీటిని పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రిస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్.రాధాకృష్ణ నిర్మాత. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఫైట్ గురించి నిర్మాత మాట్లాడుతూ...త్రివిక్రమ్ శైలిలోనే సరదాగా సాగిపోయే చిత్రమిది. వణికించే చలిలో బన్నీ వర్షం ఫైట్ చేసిన విధానం ఎంతో బాగుంది అన్నారు. అలాగే అల్లు అర్జున్ అంటే సిక్స్ పాక్ బాడీతో ఫైట్లు చేయడమే కాదు కావల్సింత వినోదాన్నీ పండిస్తారు. త్రివిక్రమ్ చిత్రాల్లో నవ్వులు రువ్వే సన్నివేశాలే కాదు ఉత్కంఠ రేపే పోరాటాలూ ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారి. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, సోనుసూద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ, తులసి, హేమ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: డి.వి.వి.దానయ్య, ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











