Just In
- 4 min ago
నా ఈ మాటలు గుర్తు పెట్టుకోండి.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
- 10 min ago
అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్న బాలీవుడ్ కండల వీరుడు
- 18 min ago
సరికొత్త లుక్‌లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే
- 24 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
Don't Miss!
- News
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి బిగుస్తున్న ఉచ్చు- ఇళ్లలో సీఐడీ సోదాలు- క్రైస్తవ గ్రామాల అన్వేషణ
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Sports
'ఇండియన్స్‌ను తక్కువ అంచనా వేయం.. ఈ గెలుపు మమ్మల్ని చాలా రోజులు బాధిస్తుంది'
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'అల.. వైకుంఠపురములో' పబ్లిక్ టాక్.. సినిమా ఎలా ఉందంటే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా 'అల వైకుంఠపురములో'. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలు నడుమ నేడు (జనవరి 12) 'అల వైకుంఠపురములో' విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చేసేశారు జనం. అయితే ఈ సినిమా వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? సినిమా గురించి టాక్ ఏంటి? ఓ లుక్కేద్దామా..

అంచనాలకు తగ్గట్టే కిక్ స్టార్ట్
అల్లు అర్జున్ గత సినిమా డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఈ సంక్రాంతికి ఆయన స్పెషల్ కిక్ ఇస్తారని అంతా భావించారు. ఈ పరిస్థితుల్లో విడుదలైన ‘అల వైకుంఠపురములో' మూవీ అంచనాలను రీచ్ అయినట్లే అని తెలుస్తోంది. ప్రీమియర్స్ చూసిన జనం సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. 2020కి బన్నీ కిక్ స్టార్ట్ ఇచ్చారని అంటున్నారు.

కామెడీ హైలైట్..
‘అల వైకుంఠపురములో' మూవీలో కామెడీ హైలైట్‌గా నిలిచిందనే టాక్ బయటకు వస్తోంది. చిత్రంలో సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని పాత్రలు ఆకట్టుకున్నాయని అంటున్నారు.

స్పెషల్ అట్రాక్షన్ వీళ్ళే మరి!
ఇక సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి పాత్రలు ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయని జనం చెప్పుకుంటున్నారు. అలాగే డాక్టర్ పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది అంటున్నారు. త్రివిక్రమ్ టేకప్‌లో తనదైన స్టైల్లో ఆయన చేసిన కామెడీ బాగుందనే టాక్ వస్తోంది.

త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ స్టోరీ.. డైలాగ్స్
ఫస్టాఫ్ అంతా కామెడీ, ఎమోషన్స్‌తో సాగిపోయిందని, త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ స్టోరీ బాగానే ఆకట్టుకుందని అంటున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వాటిని డెలివరీ చేసే విధానం ఎప్పటిలాగే హైలైట్‌గా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

అల్లు అర్జున్ డాన్స్.. త్రివిక్రమ్ మార్క్
ఇక ఎప్పటిలాగే అల్లు అర్జున్ డాన్స్‌తో ఇరగదీశాడని టాక్. మహేష్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పాటలకు బన్నీ ఇరగదీసిన తీరు ఆయన అభిమానులకు కన్నుల పండుగే అని అంటున్నారు. త్రివిక్రమ్ మార్క్, అల్లు అర్జున్ హీరోయిజం రెండూ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయనేది సగటు ప్రేక్షకుడి మాట.

అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ.. సక్సెస్ పడినట్లే
మరోవైపు అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ బాగా ఆకట్టుకుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందనేది జనం మాట. ‘అల వైకుంఠపురములో' మూవీ రూపంలో పూజా హెగ్డే ఖాతాలో మరో సక్సెస్ పడినట్లే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.