అల్లు అర్జున్ సంచలనం.. సౌత్ ఇండియా చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. అభిమానుల సంబరాలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. మెగా అభిమానులంతా ఖుషీ అయ్యేలా సూపర్ ఫీట్ సాధించారు. సౌత్ ఇండియా చిత్రసీమలోనే గతంలో ఎన్నడూ ఎవ్వరూ సాధించని ఫీట్ సాధించి సంచలనం సృష్టించారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' లోని ఒకే ఒక్క పాట ద్వారా బన్నీ ఈ మైలురాయిని చేరడం విశేషం. పూర్తి వివరాల్లోకి పోతే..

సౌత్ ఇండియా చరిత్రలోనే సరికొత్త రికార్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో' సినిమాలోని మొదటిపాట ‘సామజవరగమన' ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. విడుదలైన రోజు నుంచే ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ అరుదైన రికార్డుల దిశగా పరుగులు పెట్టింది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సాంగ్ సౌత్ ఇండియా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది.

100 మిలియన్ వ్యూస్.. ఇదే ప్రథమం
విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు ‘సామజవరగమన' పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ వస్తున్న ఈ సాంగ్ తాజాగా ఈ అరుదైన ఫీట్ సాధించింది. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించిన ఈ తెలుగు పాటకు నెటిజన్స్ బ్రహ్మరథం పట్టారు.

సూపర్ ఫామ్‌లో ‘సామజవరగమన’
సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు ఇప్పటికీ విశేష ఆదరణ లభిస్తోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ సూపర్ ఫామ్‌లో ఉందీ సాంగ్.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్.. హాట్రిక్ మూవీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో హాట్రిక్ మూవీగా రాబోతోంది 'అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
Recommended Video
సంక్రాంతి కానుక.. బన్నీ అభిమానులకు పండగే పండగ
'అల.. వైకుంఠపురములో' చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











