అల్లు అర్జున్ ఆర్య-2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రెడీ అవుతున్న ఆర్య-2 చిత్రం రిలీజ్ డేట్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కానీ..నవంబర్ ఇవయై ఐదవ తేదీన రిలీజు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయింది.ఇక ఈ చిత్రం అఫీషయల్ రిలీజ్ డేట్ ప్రకటన కోసం మరికొందరు దర్శక,నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం రిలీజ్ సమయంలో తమ చిత్రాలు విడుదల చేసి నష్టాన్ని మూటకట్టుకోకూడదనేది వారి ఆలోచన. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్,నవతేజ,కాజల్ చేస్తున్నారు. ఆర్య లాగానే క్యాట్ అండ్ గేమ్ లా ఈ చిత్రం టెన్షన్, వినోదం కలిసి నడుస్తుందని తెలుస్తోంది.
అలాగే ఈ రెండు నెలలో మరో ఏడు పెద్ద చిత్రాలు రిలీజ్ కానున్నాయి. జగపతి బాబు, ప్రియమణి కాంబినేషన్లో వచ్చే ప్రవరాఖ్యుడు డిసెంబర్ నాలుగున రిలీజ్ అవుతోంది. డిసెంబర్ రెండో వారంలో విష్ణు,ఇలియానా కాంబినేషన్ సలీం వస్తోంది. ఎన్టీఆర్, వినాయిక్ కాంబినేషన్ అదుర్స్ డిసంబర్ 18న వస్తోంది. శేఖర్ కమ్ముల లీడర్ చిత్రం డిసెంబర్ 24 న రిలీచ్ అవుతుంది. నాగార్జున రమ్మీ చిత్రం కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











