అల్లు అర్జున్ 'బద్రినాథ్'ఆడియో విడుదల తేదీ కన్ఫర్మ్
అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బద్రినాథ్' చిత్రం ఆడియో వేడుక మే 7న విడుదల కానుంది.ఈ ఆడియో పరిశ్రమలోని సినీ అతిరథమహారథుల సమక్షంలో జరుగుతుంది.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.దాంతో ఈ విషయాన్ని నిర్మాత అరవింద్ మీడియాకు తెలియచేస్తూ..'కీరవాణి మా చిత్రానికి సంగీతం అందించారు.ఇంతకుముందు మా సంస్థ నిర్మించిన 'మగధీర' చిత్రానికి, బన్ని నటించిన 'గంగోత్రి' సినిమాకీ ఆయనే సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాల ఆడియో హిట్ అయినట్లే 'బద్రినాథ్' సినిమా ఆడియో కూడా సూపర్‌హిట్ అవుతుంది. మే నెలలోనే సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.
దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ 'కీరవాణిగారు అందించిన సంగీతం చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియో విడుదలయిన తర్వాత 'బద్రినాథ్' సినిమాపై అంచనాలు పెరుగుతాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. చిన్నికృష్ణ అందించిన కథలోనే పవర్ ఉంది. గతంలో ఆయన రాసిన చిత్రాలకు మించి ఈ కథ ఉంది' అన్నారు.
ప్రకాశ్‌రాజ్, కెల్లీడోర్జ్, తనికెళ్ల భరణి, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, షయాజీ షిండే, రావురమేష్, సుధ, ప్రగతి, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: చిన్నికృష్ణ, రచనాసహకారం: శ్రీవిస్సు, మాటలు: రాజేంద్రకుమార్, ఎడిటింగ్: గౌతంరాజు, ఫొటోగ్రఫీ: ఎస్.రవివర్మన్, సంగీతం: కీరవాణి, నిర్మాణసారథి: 'ఠాగూర్' మధు, నిర్మాత: అల్లు అరవింద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











