For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'దువ్వాడ జగన్నాథం (డీజే)' కు మూలం 'అదుర్స్' కాదా...చిరు సినిమానా?

  By Srikanya
  |

  హైదరాబాద్: హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'దువ్వాడ జగన్నాథం' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ లో నుదుటున విభూతి రేఖలను ధరించి .. పంచె కట్టుతో .. సైడ్ క్రాఫ్ తో బ్రాహ్మణ యువకుడిగా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఓల్డ్ మోడల్ స్కూటర్ కి కూరగాయల సంచులు తగిలించుకుని వస్తున్నట్టుగా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. కొత్త చిత్రంలో తమ అభిమాన హీరో ఎలా కనిపిస్తాడోనని వేచి చూస్తున్న వారికి అల్లు అర్జున్‌ అదిరిపోయే లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు.

  దాంతో ఈ చిత్రం ఎన్టీఆర్ సూపర్ హిట్ అదుర్స్ నుంచి ప్రేరణ పొందినట్లు గా ప్రచారం జరుగుతోంది. అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ చిత్రం చిరంజీవి సూపర్ హిట్ ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్య నుంచి స్టోరీ లైన్ తీసుకున్నారు కానీ, కేవలం అదుర్స్ నుంచి పాత్ర మాత్రమే తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా చెప్తున్నారు.

  ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి రకరకాల మార్పులు చేసి ఈ స్క్రిప్టు ని జనరంజకంగా హరీష్ శంకర్ రెడీ చేసి తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. కామెడీ, యాక్షన్ ని పూర్తి స్దాయిలో మిక్స్ చేసిన ఈ చిత్రం ఖచ్చితంగా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు.

  Allu Arjun's DJ’s plot has been inspired from

  ఇదిలా ఉంటే... కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో ఈ చిత్రం షూటింగ్ సమయంలో వివాదం తలెత్తింది. చెన్నకేశవ- వైష్ణవ ఆలయంలో శివలింగం, ఇతర శైవాచారాలకు సంబంధించిన సెట్‌లను నిర్మించారు. అదే సమయంలో ఈ చారిత్రక ఆలయంలోకి భక్తులను కట్టడి చేశారంటూ స్థానికులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

  'మేము రాష్ట్ర దేవాదాయ శాఖకు రోజుకు రూ.లక్షన్నర చెల్లించి అనుమతులు తీసుకున్నాం' అంటూ చిత్ర దర్శక, నిర్మాతలు ఆందోళన కారులకు వివరించారు. వైష్ణవ ఆలయంలో శైవానికి సంబంధించిన సెట్లను వేయటం, భక్తులను అనుమతించకుండా అడ్డుకోవటం సరికాదని స్థానికులు నిరసన తెలిపారు. వారం రోజులుగా పూజలను సైతం నిర్వహించలేకపోతున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ భట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ వివాదం ఎప్పటికి క్లియర్ అవుతుందో చూడాలి.

  ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మార్చి కల్లా మిగిలిన భాగాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

  English summary
  The Rumours are that Allu Arjun’s DJ’s plot has been inspired from Megastar Chiranjeevi’s yesteryear blockbuster Intlo Ramayya Veedhilo Krishnayya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X