»   » అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సర్‌ప్రైజ్... ఈ నెలలోనే!

అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సర్‌ప్రైజ్... ఈ నెలలోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, పూజా హెగ్దేలు జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దువ్వాడ జగన్నాధమ్‌'. కొంత కాలంగా ఈ సినిమా గురించి హాట్ టాక్ ఇండస్ట్రీలో ఏమీ లేదు. సైలెంటుగా షూటింగ్ జరుపుకుంటూ వెళ్లిపోతున్నారు.

అయితే ఈ నెలలోనే బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 24న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫస్ట్ అఫీషియల్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్

ఆర్య, పరుగు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న మూడో చిత్రమిది. అంతే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

డిజే ఓపెనింగ్ వీడియో

పంచ్ లతో అదరకొట్టే హరీష్ శంకర్ మెగా ఫోన్ పెట్టి బన్నికు సూపర్ హిట్ అవటానికి సిద్దపడటం ఈ సినిమాకు మరో ప్లస్. మూవీ లాంచ్ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

దిల్ రాజు

దిల్ రాజు

కొంత మందితో రిలేషన్..మనకు తెలవకుండా ఏర్పడుతుంది. అదే నాకు హరీష్ తో ఏర్పడింది. వెళ్తున్న కొద్దీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ కలుస్తూంటే, రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సినిమా రంగంలో ఒకరతోనే ఒక బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయటం అరుదు. అది హరీష్ కు మా బ్యానర్ తో ఉన్న రిలేషన్ తో సాద్యమైంది అన్నారు దిల్ రాజు.

బన్నీతో మూడోసారి

బన్నీతో మూడోసారి

దిల్‌ రాజు మాట్లాడుతూ ''మా సంస్థ నుంచి వస్తున్న 25వ చిత్రమిది. బన్నీతో మూడోసారి పని చేస్తున్నాం. హరీష్‌తోనూ ఇదే హ్యాట్రిక్‌ చిత్రం. మా కాంబినేషన్‌లో కచ్చితంగా మరో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు''అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: గౌతం రాజు, కళ: ఎస్‌.రవీందర్‌, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
The first teaser of Allu Arjun-starrer Telugu action-drama "Duvvada Jagannadham" aka "DJ" will be released to co-incide with Maha Shivaratri later this month, a source said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu