అల్లు అర్జున్ ఫ్యాన్ క్లబ్ రేర్‌ఫీట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ క్లబ్ ఫేస్‍బుక్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ క్లబ్ ను ఫాలోఅయ్యే అభిమానుల సంఖ్య ఏకంగా 3 లక్షలు క్రాస్ అయింది. తన అన్నకి ఈ రేంజిలో ఫాలోయింగ్ ఉండటంపై పొంగి పోతూ తమ్ముడు అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. తెలుగు యాక్టర్స్‌లో ఇది హైయ్యెస్ట్ అండ్ రేర్ ఫీట్ అంటూ గొప్పగా ప్రకటించుకున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన 'జులాయి'చిత్రం ఆగస్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇలియనా హీరోయిన్. హారిక అండ్ హాసిని క్రియేషన్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లు శిరీష్ హీరోగా 'గౌరవం'అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాత. యామీ గౌతమి హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications












