ఈ రోజు నుంచి మళ్లీ మొదలైన బన్నీ ‘హనీ’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా హనీ(తాత్కాలిక టైటిల్) సెకండ్ షెడ్యూల్ తిరిగి ఈ రోజు నుంచి మళ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.రాధాకృష్ణ ప్రొడ్యూసర్ కాగా... డివివి దానయ్య సమర్పకులు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇలియానా తొలిసారిగా అల్లు అర్జున్‌తో జతకట్టింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తుండగా సోనుసూద్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
చాలా కాలంగా సరైన హిట్ లేని అల్లు అర్జున్...ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కథా బలం లేకున్నా సినిమాను తన స్ర్కీన్ ప్లే, పంచ్ డైలాగులతో సూపర్ హిట్ చేసే దమ్మున్న దర్శకుడు త్రివిక్రమ్ తన కెరియర్ కు మంచి బ్రేక్ ఇస్తాడని అల్లు అర్జున్ ఆశిస్తున్నాడు. మరి బన్నీ ఆశ ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











