»   »  చిరు రేంజికి రావాలనే?....5 జీవిత లక్ష్యాలు పెట్టుకున్న బన్నీ!

చిరు రేంజికి రావాలనే?....5 జీవిత లక్ష్యాలు పెట్టుకున్న బన్నీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్. మంచి నటుడిగా, మంచి డాన్సర్‌గా, స్టైలిష్ హీరోగా, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా... తన టాలెంటుతో ఇతర సినీ పరిశ్రమల్లోనూ పాగా వేసాడు. ప్రస్తుతం సౌత్‌లో బాగా సంపాదిస్తున్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు.

అయితే కేవలం సినిమాలు, సంపాదనకే పరిమితం కాకుకుండా.... సేవా కార్యక్రమాలతో అభిమానులు, ప్రజల నుండి మొప్పుపొందాలని ఆరాటపడుతున్నారు బన్నీ. మామయ్య చిరంజీవి ఆదర్శంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే తరహాలో...అల్లు అర్జున్ కూడా ఏదైనా సేవా సంస్థ స్థాపించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి సేవా సంస్థ స్థాపించడం ద్వారా ముందుకు సాగాలనే దానిపై బన్నీ స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బన్నీ ప్లాన్స్ చూస్తుంటే... మామూలుగా లేవని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. సినిమా రంగంలో చిరంజీవి రేంజికి రావాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోవు, అందుకు సేవా కార్యక్రమాలు కూడా తోడు కావాలని బన్నీ బలం విశ్వసిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

5 లక్ష్యాలతో బన్నీ ముందుకు సాగుతున్నారు...

సౌత్ ఐకానిక్ హీరోగా ఎదగాలని...

సౌత్ ఐకానిక్ హీరోగా ఎదగాలని...


బన్నీ పెట్టుకున్న లక్ష్యాల్లో మొదటిది సౌత్ లో ఐకానిక్ హీగా ఎదగాలని.

అవార్డులు

అవార్డులు


గవర్నమెంటు నుండి ప్రతిష్టాత్మక అవార్డులు... (పద్మ అవార్డలు, దాదా సాహెబ్ ఫాల్కే లాంటివి)

ట్రెండ్ బ్రేకింగ్ మూవీస్

ట్రెండ్ బ్రేకింగ్ మూవీస్


తన సినీ కెరీర్లో కనీసం 5 ట్రెండ్ బ్రేకింగ్ సినిమాలు ఉండాలని బన్నీ ఆశ పడుతున్నారు.

తన సినిమాలు...

తన సినిమాలు...


తన సినిమాల పేర్లు ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డుల వేడుకలో మార్మోగుతూ ఉండాలి.

చారిటబుల్ ట్రస్ట్

చారిటబుల్ ట్రస్ట్


చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాలని, దానికి ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు ఉండాలి.

English summary
Stylish Star Allu Arjun has uncovered many things about his life, his views and his ambitions in an interview published by 'Eenadu' newspaper today in its cover page article in Sunday's special edition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu