బన్నీ షార్ట్‌ఫిల్మ్ ఆవిష్కరణ(ఫొటోలు)
హైదరాబద్: అల్లు అర్జున్ తొలిసారిగా షార్ట్‌ఫిల్మ్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. 'ఐ యామ్ ద ఛేంజ్' పేరుతో తీసిన ఈ లఘుచిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ ఈ దీనిలో నటించడంతో పాటు ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ లఘుచిత్రాన్ని గురువారం అల్లు అర్జున్, సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'ఐ యామ్ ద ఛేంజ్' షార్ట్‌ఫిల్మ్ రూపకల్పనలో తమ అనుభవాలను ఇరువురు మీడియాతో పంచుకున్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ..."చేతిలో ఓ కెమెరా, మెదడులో ఓ చిన్న ఆలోచన, సినిమా తీయాలన్న తపన...ఇవి చాలు వారికి సినిమా తీయటానికి...కానీ నిజానికి షార్ట్ ఫిలిం తీయటం అంత చిన్న విషయం ఏమీ కాదు..ఆర్దికంగా ఇంత బలంగా, ఇంత సపోర్ట్ ఉన్న నేనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇంత కష్టపడాల్సి వచ్చింది అన్నారు.
ప్రెస్ మీట్ ఫొటోలు...

అల్లు అర్జున్ మాట్లాడుతూ...
మరి ఏ అండాలేకుంజా, ఆర్దికంగా చాలా వెనకబడి ఉన్నా కూడా సినిమాపై ఉన్న ప్రేమతో వారంతో ఎలా సినిమాల్ని తీయగలుగుతున్నారో అర్దమవ్వదు. నిజంగా వారందరికీ నా అభినందనలు...." అన్నారు.

అలాగే...
ఇక ఎప్పటినుంచో ఓ మంచి కథాంశాల్ని ఎంచుకొని సమాజానికి ఉపయోగపడే ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుంటుండేవాణ్ణి. ఇదిగో ఇన్నాళ్ళికిలా సుకుమార్ గారి దర్శకత్వంలో ఆ కల నెరవేరింది. అంటూ ఈ సినిమా తీయటం వెనక ఉన్న ఉద్ధేశాన్ని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

సుకుమార్ మాట్లాడుతూ...
నాకు డబ్బు అవసరమైనప్పుడు బన్ని జేబులోంచి అడక్కుండానే తీసుకునే చొరవ ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు కోర్ కాన్సెప్టు బన్నిదే. ఎవరికి తగ్గ స్ధాయిలో వారు కర్తవ్యాన్ని నిర్వహిస్తూంటారు. అదే విషయాన్ని బన్ని చెప్పి చేద్దామన్న్నాడు. మరుసటి రోజు షూటింగ్ చేసేశాం. ఇది చాలా మంచి ప్రయత్నం. లీడ్ తీసుకున్న బన్నికి ధాంక్స్.

ఎప్పుడు రిలీజ్ ...
ఈ రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఈ షార్ట్ ఫిలిం యూ ట్యూబ్ లో చూడవచ్చు.


Click it and Unblock the Notifications











