అల్లు అర్జున్ 'ఐకాన్' ఫిలిప్పీన్స్ చిత్రానికి రీమేకా.. బైక్ చుట్టూ కథ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. బుధవారం రోజే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. బన్నీ కోసం దర్శకులు వరుసగా క్యూ కడుతున్నారు. త్రివిక్రమ్ తర్వాత వేణు శ్రీరామ్, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించాల్సి ఉంది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రానికి ఐకాన్ కనబడుటలేదు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్ర కథ గురించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది.

ఫిలిప్పీన్స్ చిత్రానికి రీమేక్
ఐకాన్ కనబడుటలేదు చిత్రం ఫిలిప్పీన్స్ దేశంలో సూపర్ హిట్ అయిన 'కిటా కిటా' అనే చిత్రానికి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. కిటా కిటా కథలో కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపిందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలని అల్లు అర్జున్ సన్నిహితులు ఖండించినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ రాసిన తన సొంత కథతోనే ఐకాన్ చిత్రం ఉంటుందని అంటున్నారు.

బైక్ చుట్టూ కథ
ఇక ఐకాన్ చిత్ర కథ ఇదే అంటూ మరో ఊహాగానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐకాన్ చిత్రాన్ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ ని ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు. సినిమా కథ మొత్తం ఈ బైక్ చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తనకు చాలా ఇష్టమైన బైక్ ని పోగొట్టుకుంటాడట. బైక్ కోసం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తాడట.

మైండ్ గేమ్
బైక్ పోయిందని ఫిర్యాదు చేస్తే వేరే పోలీస్ స్టేషన్ కు వెళ్ళమని పోలీసులు చెబుతారు. మరో పోలీస్ స్టేషన్ లో కూడా బన్నీకి అదే పరిస్థితి ఎదురవుతుంది. దీనితో పోలీసులకు బుద్ది చెప్పాలని అల్లు అర్జున్ భావిస్తాడట. అక్కడి నుంచి పోలీసులకు, బన్నీకి మధ్య మైండ్ గేమ్ మొదలవుతుందని అంటున్నారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందో తెలియాలంటే దర్శకుడు వేణు శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.

దిల్ రాజు నిర్మాణంలో
ఆర్య, పరుగు, డీజే చిత్రాల తర్వాత బన్నీ, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పూర్తయ్యాక బన్నీ సుకుమార్ చిత్రాన్ని ప్రారంభిస్తాడా లేక ఐకాన్ చిత్రాన్ని ప్రారంభిస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్, బన్నీ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరక్కుతున్న చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











