'ఇద్దరమ్మాయిలతో' వాయిదా,కొత్త డేట్ ఖరారు
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ నెల 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొన్నారు. చిత్రం విడుదల వాయిదాపడింది.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ....ఈ నెల 31న తెరపైకి తీసుకురాబోతున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి. వినోదం, యాక్షన్ అంశాలు మేళవించిన ప్రేమ కథా చిత్రమిది అన్నారు.
అలాగే ఇందులో అల్లు అర్జున్ పాత్ర, ఆయన నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అర్జున్ కాస్ట్యూమ్స్, కేశాలంకరణ ఆధునిక శైలిలో ఉంటాయి. తొలిసారి ఆయన ఇద్దరు హీరోయిన్స్ తో నటించారు. పూరి తీర్చిదిద్దిన ప్రేమ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఈ సినిమాలోని పోరాటలను విదేశాలకు చెందిన పోరాట నిపుణులు తీర్చిదిద్దారు అని చెప్పుకొచ్చారు.
ఇక కీచా అనే హాంకాంగ్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేసిన ఫైట్స్ ఉత్కంఠను రేకెత్తిస్తాయి. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన గీతాలకు స్పందన బాగుంది. టాప్ లేచిపోద్ది.., వయొలిన్ పాటలు యువతకు అమితంగా నచ్చాయని గణేష్ వివరించారు. ఈ చిత్రానికి సమర్పణ: బండ్ల శివబాబు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్.


Click it and Unblock the Notifications











