'నీ ఇంటి ముందో గేటు.. దూకాలంటే డౌటు' :అల్లు అర్జున్
అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రం పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఈ తేదీని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు మీదున్న దేవి ఈ ఆడియోని అదరకొట్టాడని చెప్తున్నారు.
అల్లు అర్జున్ తాజాగా 'నీ ఇంటి ముందో గేటు.. దూకాలంటే డౌటు' అనే పాటను అందుకున్నాడు. తన లేటెస్ట్ చిత్రం'జులాయి'కోసం ఈ పాటలో ఇరగతీస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో 'నీ ఇంటి ముందో గేటు' అనే పాటను అల్లు అర్జున్, ఇలియానాపై తెరకెక్కిస్తున్నారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...''త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఓ అందమైన అనుభవం. అలాగే మళ్లీ నా సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడం, ఇలియానాతో తొలిసారి నటించడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారితో తొలిసారి నటిస్తున్నాను. ఆయన డైలాగ్ టైమింగ్ సూపర్బ్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో డైలాగ్స్‌కి విజిల్స్ పడతాయి'' అని అన్నారు.
'జులాయి' స్టోరీలైన్ విషయానికి వస్తే...పని, పాట లేకుండా తిరిగేవాడ్ని పెద్దలు 'జులాయి' అంటుంటారు. ఆ పెద్దలే... మగాడు తిరక్క చెడతాడు... ఆడది తిరిగి చెడుతుంది అని సూక్తులు వల్లిస్తుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలాకష్టం. అందుకే ఆ పెద్దల తిట్లను కూడా ఆశీర్వాదాలుగా తీసుకుంటుంటాడు ఓ కుర్రాడు. వాళ్లు 'వెధవ' అన్నా... 'వెయ్యేళ్లు ధనముతో వర్థిల్లు' అని దీవించినంత ఆనందపడిపోతాడు. అలాంటి కుర్రాడికి ఓ కుర్రది తారసపడితే... ఇక ఆ సందడికి హద్దు ఉంటుందా... అల్లు అర్జున్ 'జులాయి' సినిమా నడక ఇలాగే ఉంటుంది .
నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్ శైలిలోనే సరదాగా సాగిపోయే చిత్రమిది. యాక్షన్ అంశాలకూ ప్రాధాన్యం ఉంది. జులాయిగా తిరిగే ఓ అబ్బాయి... తన లక్ష్యం ఎలా ఏర్పరచుకొన్నాడు? అందుకోసం ఏం చేశాడో తెరమీదే చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఆకట్టుకొంటాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.
సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.


Click it and Unblock the Notifications











