‘జులాయి’ఆడియో రిలీజ్ విశేషాలు
అల్లు అర్జున్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం 'జులాయి'. ఈ చిత్రం ఆడియో నిన్న ఆదివారం రాత్రి ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. తొలి సీడీని పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు స్వీకరించారు. లోగోని అల్లు అరవింద్ విడుదల చేశారు. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్. డీవీవీ దానయ్య సమర్పకుడు.
ఈ సందర్భంగా దాసరి నాయారణ రావు మాట్లాడుతూ...'''గంగోత్రి'లో బన్నీని చూసినప్పుడు.. 'ఇతను కామెడీ హీరో అవుతాడా? లేక ఫ్యామీలీ హీరో అవుతాడా?' అనే ఆలోచనలు నా మనసులో మెదిలాయి. నా ఆలోచనలకు భిన్నంగా తనకంటూ ఓ సపరేట్ రూట్‌ని క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. 'దేశముదురు' చూసి తనలో ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. వారం రోజుల క్రితమే పాటలు విన్నాను. ఈ పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు డాన్సులుచేస్తారు'' అని అన్నారు.
అలాగే తన మనసుకి ఎంతో నచ్చితే కానీ పవన్‌కల్యాణ్ ఏ వేడుకకి హాజరు కారు. 'గబ్బర్‌సింగ్'తో కలెక్షన్ కింగ్ అని నిరూపించుకున్నారు పవన్. నేను 'జల్సా' సినిమాను ఎప్పటికీ మరిచిపోలేను. 'జులాయి'తో త్రివిక్రమ్ మళ్లీ తన జండా ఎగురవేస్తాడని నా నమ్మకం. ఇక నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే... తెలుగు సినిమా పుట్టిన కొన్నాళ్ల వరకూ కథ, మాటలు రాసినవాళ్ళెవరూ దర్శకులుగా సక్సెస్ కాలేకపోయారు. దాన్ని బ్రేక్ చేసింది నేనే. నా తర్వాత జంధ్యాల ఆ క్రెడిట్ సాధించారు. మా దారిలోనే త్రివిక్రమ్ కూడా విజయం సాధించడం ఆనందించదగ్గ విషయం. ఒక మంచి రచయిత దర్శకత్వంలో సినిమా వస్తే ఆ సినిమా ఒక కావ్యం అవుతుంది. అందుకు ఏన్నో సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు అని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ''పాటలు బాగున్నాయి. పాటలతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలి''అని చెప్పారు. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు. రామ్‌చరణ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ''పెళ్లి పనుల వలన రాలేకపోయాను. ప్రకటన చిత్రం చూశాను. సంభాషణలు బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకొనేలా ఉంది. నా సినిమాకి కూడా ఇంకా మంచి స్వరాలు అందించాలని కోరుకుంటున్నాని''అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ-''నా దృష్టిలో రియల్‌స్టార్ అంటే పవర్‌స్టారే. పవన్‌కళ్యాణ్ రావడం వల్ల ఈ వేడుక కొత్త కళను సంతరించుకుంది. ఫైట్లు, డాన్సులు గొప్పగా చేసినంత మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు అలవోకగా వల్లించినంత మాత్రాన ఎవరూ పెద్ద స్టార్లు అయిపోరు. ఇక్కడ ప్రవర్తన ముఖ్యం. ఈ మధ్య హిట్ అనిపించుకున్న ఏ సినిమా పోస్టర్ చూసినా ఆల్‌టైమ్ రికార్ట్ అని కనిపిస్తుంది. కానీ 'గబ్బర్ సింగ్' పోస్టర్‌లో మాత్రం ఆ అక్షరాలు కనిపించవు. ఎందుకంటే... పవన్‌కళ్యాణ్‌కి అభద్రతాభావం లేదు. ఆయన రియల్‌స్టార్ అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డా.రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, నాగబాబు, దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి, శ్రీనువైట్ల, తమన్నా, బ్రహ్మానందం, హరీష్‌శంకర్, బండ్లగణేష్, తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











