‘జులాయి’లో అల్లు అర్జున్ పేరు, క్యారక్టరేంటి?
అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పేరు రవి. అతని క్యారక్టేర్ డిఫెరెంట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ నోటివెంట వచ్చే త్రివిక్రమ్ డైలాగ్స్ వల్ల థియేటర్లన్నీ విజిల్స్‌తో నిండిపోవడం ఖాయం. అల్లు అర్జున్ ఎనర్జీ, అబ్బురపరిచే ఆయన డాన్సులు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి అంటున్నారు చిత్ర సమర్పకులు దానయ్య. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని డీటీఎస్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు నిర్మాత కె.రాధాకృష్ణ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
అల్లు అర్జున్ క్యారెక్టర్ ప్రకారం ఏమిటంటే...చదరంగం అంటే ఏమిటి? ఎన్ని గడులు ఉంటాయి? ఏ పావుని ఎలా కదపాలి? ఇలాంటి విషయాలన్నీ తెలిసినవాడితో చదరంగం ఆడడం, అందులో గెలవడం సులభమే. అయితే ఇవేమి పట్టకుండా... తనకు తెలిసిన పద్ధతిలోనే ఆడతానని పట్టుబడితే అతన్ని ఓడించడం కష్టం. రవి అలాంటి కుర్రాడే. ప్రయాణంలో పది దారులు ఎదురుపడితే పదకొండో మార్గం ఎంచుకొంటాడు. అందరూ రిస్కూ అంటుంటే అందులోనే కిక్కు ఉందని నమ్ముతాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఓ ఆట మొదలెట్టాడు. ఇంతకీ ఈ ఆటలో గెలిచాడో లేదో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లు అర్జున్.
''నేనేడ పుడితె నీకేంటన్నాయ్.. నేనెట్టగుంటె నీకేంటన్నాయ్.. నానేటి చేస్తె నీకేంటన్నాయ్.. సిరాకు పెట్టకన్నాయ్'' ప్రస్తుతం యూత్‌తో చిందులేయిస్తున్న పాట ఇది. ఈ ఒక్క పాటే కాదు. 'జులాయి' సినిమాలోని మిగిలిన అయిదు పాటలూ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నవే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రారంభంలోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు దేవిశ్రీ అందించిన స్వరాలు శ్రోతలను విశేషంగా అలరిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి.
అలాగే ''ఉల్లాయి లాయి రావో జులాయి'' అంటూ 'జులాయి' సినిమా చూడటానికి ఆతృతగా ఆహ్వానిస్తున్నారు యువతరం. '''గబ్బర్‌సింగ్'తో తెలుగునాట మ్యూజిక్ మేనియా క్రియేట్ చేసిన దేవిశ్రీ, మళ్లీ 'జులాయి' పాటలతో ఆ మేనియాని కొనసాగించారు. ఈ నెల 8న ఘనంగా ఈ పాటల పండుగ చేసుకోబోతున్నాం. డా.రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాకు వెన్నెముక. సోనూసూద్ కూడా ఓ మంచి పాత్ర చేశారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్వుల పర్యంతం చేస్తాయి. ఇక ఇలియానా ఇందులో కొత్తగా కనిపిస్తారు, ఆడియో సక్సెస్ సినిమా విజయానికి యాభై శాతం తోడ్పడుతుందని అని ఆయనన్నారు.


Click it and Unblock the Notifications











