»   » బన్నీ, దేవి ఇరగతీసారు: సత్యమూర్తి ప్రమోషన్ సాంగ్ (పూర్తి వీడియో)

బన్నీ, దేవి ఇరగతీసారు: సత్యమూర్తి ప్రమోషన్ సాంగ్ (పూర్తి వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రం పైన ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిత్రంపై మరింత అంచనాలు పెంచటానికా అన్నట్లు బన్ని, దేవిశ్రీప్రసాద్ కలిసి ఓ ప్రమోషన్ సాంగ్ చేసి వదిలారు. ఇప్పుడా ప్రమోషన్ సాంగ్ ఓ రేంజిలో అభిమానులను అలరిస్తోంది. తాజాగా విడుదలైన ఈ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడురేసుగుర్రం ఘన విజయంతో బన్నీ, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి'పై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎడిటింగ్ అనంతరం 162 నిమిషాలు ఉంది. అంటే దాదాపు 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది.


ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ కూడా ముగించుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9వ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీతో పాటు సమంతా, నిత్యామీనన్, ఆదాశర్మ, స్నేహ, రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర వంటి స్టార్స్ అంతా నటిస్తున్నారు.


'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌.


 Allu Arjun's Latest Film S/o Satyamurthy Promotional Song Full Video.

తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు త్రివిక్రమ్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి'.


చిత్ర నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు త్రివిక్రమ్‌. బన్నీ స్త్టెల్‌, నటన అందరికీ నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం శ్రోతలను అలరిస్తోంది''అన్నారు.


అల్లు అర్జున్‌ హీరో. సమంత, నిత్య మేనన్‌, ఆదా శర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

English summary
Watch Allu Arjun's Latest Film S/o Satyamurthy Promotional Song Full Video. This movie is written & directed by Trivikram Srinivas and produced by D. V. V. Danayya, S. Radha Krishna & Allu Aravind under the banner Haarika & Hassine Creations. This music is composed by Devi Sri Prasad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu